రాష్ట్రీయం

గోల్‌మాల్.. గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల గందరగోళం పతాకస్థాయికి చేరింది. బదిలీలకు ఓకే చేసిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఉత్తర్వులను, షెడ్యూలును జారీ చేసినా మార్గదర్ళకాల్లో ఉన్న అనేక అనుమానాలు టీచర్లను అయోమయంలోకి నెట్టేశాయి. మరోపక్క ఇప్పటికే ప్రభుత్వం దొడ్డిదారిన ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయి. పాత జిల్లాల ప్రకారం కౌనె్సలింగ్ చేస్తున్న ప్రభుత్వం, కొత్త జిల్లాల ప్రకారం ఆదేశాలివ్వడంతో టీచర్ల బదిలీలు గందరగోళంలో పడ్డాయి. గురు, శుక్రవారాల్లో ఉప ముఖ్యమంత్రి ఉపాధ్యాయ జేఏసీలు, విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘచర్చలు జరిపారు. అంతకంటే ముందు అదనపు అడ్వకేట్ జనరల్‌తో సమావేశమై ఏకీకృత సర్వీసు రూల్స్‌పై స్టేటస్‌కో ఉన్నందున యాజమాన్యాలవారీ బదిలీలు, పదోన్నతులు చేపట్టడానికి ఉన్న అవకాశాలు, అవరోధాలనూ చర్చించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదోన్నతులు చేపట్టకపోవడమే మేలని, యాజమాన్యాల వారీ బదిలీలకు ఇబ్బంది లేదని న్యాయశాఖ పేర్కొనడంతో ఉపాధ్యాయ సంఘాల జేఏసీలతో సమావేశమై బదిలీలు మాత్రమే జరుపుతామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అధికారులు షెడ్యూలు ఖరారు చేసి సోమవారం నాటికి విడుదల చేస్తారని ఉప ముఖ్యమంత్రి ఉపాధ్యాయ నేతలకు చెప్పారు. జూన్ 6 నుంచి 10 వరకూ ఆన్‌లైన్ అప్లికేషన్లు స్వీకరిస్తారు. 12నాటికి లిస్టులు ప్రకటిస్తారు. 4న ఖాళీలను ప్రకటించి జిల్లాల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం 6న తుది జాబితా ప్రకటిస్తారు. జూన్ 20నాటికి ప్రక్రియ పూర్తి చేస్తారు. పంచాయతీ ఎన్నికలు అనంతరం అంతర్‌జిల్లా, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. దానికి సంబంధించిన షెడ్యూలు మాత్రం ఇపుడే ఖరారు చేస్తారు. ఉప ముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, కమిషనర్ అదర్‌సిన్హా, జాయింట్ సెక్రటరీ విజయకుమార్, అదనపు డైరెక్టర్లు పివి శ్రీహరి, జెడి శ్రీనివాసాచారి, ముగ్గురు ఎమ్మెల్సీలు చావ రవి, బి కొండల్‌రెడ్డి, పులి సరోత్తంరెడ్డి, జి భుజంగరావు, ఎ రామచంద్రం, విష్ణువర్థనరెడ్డి, చంద్రమోహన్‌లు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక పక్క బదిలీలకు సర్వం సిద్ధం చేస్తున్నా, పాత కొత్త జిల్లాల వ్యవహారం, ప్రభుత్వం
నేరుగా ఉత్తర్వులు ఇవ్వడంతో ఎదురైన తలనొప్పులతో అధికారులు గందరగోళానికి గురవ్వడంతో కొంతమంది ఇప్పటికే రిలీవ్ అయి కొత్త స్కూళ్లలో జాయిన్ కాగా, మరికొంత మంది రిలీవ్ అయినా కొత్త స్కూళ్లల్లో జాయిన్ కాలేక గాలిలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి, వికారాబాద్ , మేడ్చెల్ జిల్లాలుగా విడిపోవడంతో పాత జిల్లా నుండి విడిపోయిన కొత్తజిల్లాకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్‌గా టీచర్లు వస్తున్నారు. రంగారెడ్డి నుండి మేడ్చెల్ జిల్లాకు అంతర్ జిల్లా బదిలీలపై వచ్చారు. అలాగే నల్గొండ జిల్లా నుండి యాదాద్రి కొత్త జిల్లాకు, సూర్యాపేటకు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి రంగారెడ్డికి టీచర్లు బదిలీపై వచ్చారు. బదిలీల కంటే ముందు పాత జిల్లాల్లో ఉన్న టీచర్లనుండి ఆప్షన్లు కోరకపోవడం వల్ల రానున్న రోజుల్లో బదిలీలు, పదోన్నతుల్లో తప్పనిసరిగా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని, బలవంతంగా కొత్త జిల్లాలకు బదిలీ చేస్తే టీచర్లు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో కేసులు వేలల్లో దాఖలయ్యే ముప్పు ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. ఇదే బదీలల ప్రక్రియను నాలుగైదు నెలల ముందు ప్రారంభించి ఆప్షన్లు అడిగి ఉంటే బావుండేదని వారు చెబుతున్నారు.