రాష్ట్రీయం

ఆనందం ఆవిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ సారి గడువుకంటే ముందే వస్తున్నాయన్న ఆనందం ఆవిరైంది. సాధారణంగా జూన్ 5నాటికి రాష్ట్రాన్ని తాకే నైరుతి, ఈసారి 2నే పలుకరిస్తుందని అంచనా వేశారు. బంగాళాఖాతంలో పరిస్థితులు ఆశించిన దానికంటే భిన్నంగా ఉండటంతో ముందస్తు ఆశ పోయిందని తుపాను హెచ్చరికల కేంద్రం భావిస్తోంది. అరేబియన్ సముద్రంలో రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉంటూ అనుకున్న దానికంటే ముందుగానే కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం కన్పించిందన్నా రు. ప్రస్తుతం కర్నాటకలో కూడా హసన్, మైసూర్ ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం ఉందన్నారు. అయితే బంగాళాఖాతంలో మాత్రం రుతుపవనాల కదలికకు అనుకూల వాతావరణం లేకపోవడంతో ఆలస్యం ఆలస్యమవుతోందని అధికారులు అంచనావేస్తున్నారు.