రాష్ట్రీయం

ఏపీ టెట్ జిల్లా పరీక్ష కేంద్రాలకు 3,83,066 మంది ఆప్షన్ల నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 1: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించి జిల్లా పరీక్ష కేంద్రాల ఆప్షన్ల నమోదు ముగిసిందని ఏపీ టెట్ కన్వీనర్ ఎ సుబ్బారెడ్డి తెలిపారు. టెట్‌కు మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,83,066 మంది అభ్యర్థులు సెంటర్ల ఆప్షన్లను పెట్టుకున్నారని శుక్రవారం ఆయన పేర్కొన్నారు. ఆప్షన్లను పెట్టుకున్న అభ్యర్థులకు వారు సూచించిన ప్రకారమే సెంటర్ల ఎంపిక ఉంటుందన్నారు. 96.258 శాతం మంది ఆప్షన్లు పెట్టగా (14,891 మంది) 3.742శాతం మంది అభ్యర్థులు ఆప్షన్లు పెట్టలేదన్నారు.
వీరికి నోటిఫికేషన్‌లో జారీచేసిన ఆదేశాల ప్రకారం సదరు అభ్యర్థులకు దగ్గరలోని జిల్లా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని, ఒక వేళ ఆ సెంటర్లలో పరిమితికి మించితే తదుపరి జిల్లా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామన్నారు. జూన్ 5వతేదీ మధ్యాహ్నం 12గంటల నుండి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. టెట్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.