రాష్ట్రీయం

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 1: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పోటీచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల యాజమాన్య నిర్వహణ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ఎన్నికల్లో పవన్‌తోగాని, జగన్‌తోగాని పొత్తుపెట్టుకునే ఉద్దేశం తమ పార్టీకి లేదని స్పష్టంచేశారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సోము పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్య కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నా ఆ రంగంలో ఎటువంటి మార్పు కనిపించడంలేదన్నారు. ఏటా విద్యారంగానికి రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నారని, ఐదేళ్లలో కేటాయించిన రూ.1.5 లక్షల కోట్లతో పది పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చన్నారు. ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదన్నారు. అలాగే వైద్య రంగానికి సైతం ఏటా రూ.20 వేల కోట్లు వెచ్చిస్తున్నా ఫలితం లేదని, ఇటువంటి వౌలిక విషయాలపై దృష్టిపెట్టని ప్రభుత్వం ప్రత్యేక హోదా వంటి అంశాలను లేవనెత్తి ప్రజల దృష్టి మళ్లిస్తోందన్నారు. ఇదేనా సమర్థత అంటే అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సరైన రాజకీయ వ్యవస్థ, సరైన పరిపాలన ఉంటే కోట్లు ఖర్చు పెట్టే సంస్థల్లో ఆశించిన ఫలితాలు వస్తాయని, అపారమైన అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ఎందుకు ఈ విధంగా చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. నెలకు 1.50 కోట్ల కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నా రాష్ట్రంలో రక్తహీనత సమస్య ఎందుకుందో అలోచన చేయాలన్నారు. 60సీ పేరుతో పోలవరం అంచనాలు పెంచి, ఆ డబ్బును టీడీపీ కార్యర్తలకు పంచేస్తున్నారని ఆరోపించారు.
హోదా కంటే ప్యాకేజి వల్లే ఎక్కువ ప్రయోజనం
రాష్ట్రానికి ప్రత్యేక హోదావల్ల ఏటా రూ.3000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు మాత్రమే వస్తాయని, ప్రత్యేక ప్యాకేజి వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనం లభిస్తుందన్నారు. అయినా హోదా పేరిట పక్కదారి పట్టిస్తున్న చంద్రబాబునాయుడు మాయలో పడొద్దని ప్రజలకు సోము సూచించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. కొంతమందికి బీజేపీ పాలన ఇబ్బందిగా అనిపించి, వారంతా ఐక్యమవుతున్నారని, దీనివల్ల వారికి కొంత బువ్వ దొరుకుతుందని ఎద్దేవాచేశారు.నిత్యావసరమైన పెట్రోలు ధరలు తగ్గించాల్సిందేనని, ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ధార్మిక సంస్థలో ధార్మిక, ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు, పీఠాధిపతులు వంటి వారిని నియమించాలని, తాము అధికారంలోకి వస్తే ఇటువంటి వ్యక్తులకు అజమాయిషీ ఇస్తామన్నారు.కొన్నిసార్లు కొన్ని ప్రయోగాలు చేయాల్సివస్తోందని, బయట పార్టీ వ్యక్తులను బీజేపీలోకి ఆహ్వానించినప్పటికీ తమ భావజాలాన్ని వారికి వివరించడం ద్వారా వాళ్లల్లో మార్పుతెచ్చే ప్రయత్నం చేస్తున్నామని సోము పేర్కొన్నారు.