రాష్ట్రీయం

ఒకటో తేదీ ఉదయానికే జీతాలు, పింఛన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 1: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త విధానాన్ని గాడిలో పెట్టింది. దీంతో రెండు మాసాల అనంతరం జూన్ 1వ తేదీ ఉదయానికి జీతాలు, పెన్షన్ల చెల్లింపులు జరిగిపోయాయి. ఏ ఒక్కరూ ట్రెజరీ కార్యాలయాలు, బ్యాంక్‌ల చుట్టూ తిరుగకుండానే అన్ని రకాల బిల్లుల చెల్లింపుల కోసం జపాన్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయు కుదుర్చుకుంది.
ఈమేర కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం- ‘సీఎఫ్‌ఎంఎస్’ (సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం)కు గత ఏప్రిల్ ఒకటో తేదీ సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. అయితే ముందస్తు ప్రణాళికలు లేకపోవటంతో తొలుత 10తేదీ వరకు ఎక్కువ మందికి జీతాలు, పెన్షన్ల చెల్లింపులు జరుగకపోవటంతో ఉద్యోగులు, పెన్షనర్లు గగ్గోలు పెట్టారు. నూతన విధానంలో డ్రాయింగ్ అధికారులు బిల్లులపై సంతకాల స్థానంలో వేలిముద్రలు పెట్టాల్సి రావటంతో అత్యధిక కార్యాలయాల్లో సంబంధిత మిషన్లు పనిచేయక బిల్లులు ఆగిపోయి గందరగోళం చెలరేగటంతో సీఎం స్వయంగా జోక్యం చేసుకుని వేలిముద్రలు లేకపోయినా బిల్లులను ఆమోదింపచేశారు. మే మాసంలోనూ ఇదే స్థితి.
దీంతో ప్రభుత్వానికి అప్రదిష్ట వస్తుందని భయపడిన అధికారులు గత నెల 24తేదీ పెన్షన్లు, 26తేదీ జీతాల బిల్లులను స్వీకరించి తదుపరి చర్యలు చేపట్టారు. దీంతో శుక్రవారం ఉదయం 9 గంటలకే ఉద్యోగులు, పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో జీతాలు, పెన్షన్లు జమ అవటంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.