రాష్ట్రీయం

రైళ్ల సమయపాలనపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: విజయవాడ రైల్వే డివిజన్‌లో రైళ్ల సమయపాలన మెరుగుపర్చేందుకు దృష్టి కేంద్రీకరించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు.
భారత రైల్వేలో కీలకమైన విజయవాడ డివిజన్‌లో రైళ్ల సమయపాలన మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. శుక్రవారం నాడిక్కడ రైల్ నిలయంలో నిర్వహించిన ప్రత్యేకంగా విజయవాడ డివిజన్‌పై నిర్వహించిన సమావేశంలో జిఎం మాట్లాడారు. 24 గంటలు రైళ్లు సాఫీగా గమనానికి చేరుకునే విధం గా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రయాణీకుల రవాణాతో పాటు సరుకు రవాణాలోనూ విజయవాడ డివిజన్ దేశ రైల్వేలో ఎంతో కీలకమైనదని ఆయన గుర్తు చేశారు.
అటువంటి డివిజన్‌లో సమయపాలన మెరుగు పడితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. అభివృద్ధి దశలో ఉన్న రైల్వే ప్రాజెక్టు పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆ సమావేశంలో విజయవాడ డిఆర్‌ఎం ఆర్.్ధనుంజయను కోరారు. ఈ సమావేశంలో విజయవాడ డిఆర్‌ఎంతో పాటు పలువురు హాజరయ్యారు.