రాష్ట్రీయం

పెద్దగెడ్డ నీటిని చేపల చెరువులకు వాడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, జూన్ 1: నియోజకవర్గ ఇన్‌ఛార్జి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ అక్రమాలపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం విజయనగరం జిల్లా సాలూరులోని బోసుబొమ్మ జంక్షన్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆద్యంతం భంజ్‌దేవ్ అక్రమాలపైనే కొనసాగింది. రైతుల పొలాలకు వినియోగించాల్సిన పెద్దగెడ్డ నీటిని భంజ్‌దేవ్ చేపల చెరువులకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. చేపల చెరువుల కంపునీటిని దిగువ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలకు విడిచిపెడుతున్నారన్నారు. రైతుగా వారు పడే శ్రమ తనకు బాగా తెలుసన్నారు. రైతు సమస్యలపై జనసేన ఎంతటివారినైనా ప్రశ్నిస్తుందన్నారు. గిరిజనేతరుడైన భంజ్‌దేవ్‌కు సీఎం చంద్రబాబునాయుడు ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. ఆయన గిరిజనుడు కాదని హైకోర్టు తీర్పు ఇచ్చినా ఎస్టీ అని ఎలా ధ్రువీకరిస్తారని నిలదీశారు. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా బాగా వెనుకబడిన ప్రాంతమన్నారు. ఏళ్ల తరబడి సాలూరు పట్టణాభివృద్ధిని పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. వైసీపీ, టీడీపీ నాయకులు కుమ్మక్కై పట్టణాభివృద్ధిని విస్మరించారన్నారు. పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణం జరగలేదన్నారు. రాష్ట్రంలో 17వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మించామని చెబుతున్న మంత్రి లోకేష్ ఇక్కడి బైపాస్ రోడ్డును పట్టించుకోలేదన్నారు. ఆటోనగర్‌ను నిర్మిస్తామని గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి హామీ ఇచ్చి విస్మరించారన్నారు. విజయవాడ తరువాత రాష్ట్రంలో లారీలు ఇక్కడే అధికంగా ఉన్నాయన్నారు. 2వేలకు పైగా ఉన్న లారీలపై ఆధారపడి 25వేలమంది కార్మికులు జీవనం సాగిస్తున్నారన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు దగ్గరలో ఉన్న పట్టణం కావడంతో పర్యాటక అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఈ ప్రాంతంలో హెవీ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. గిరిజన యూనివర్సీటీని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుండేదన్నారు. 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకాలేదన్నారు. జనసేన అధికారంలో వస్తే గిరిజనాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. తామరకొండ తవ్వకాలకు ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా అనుమతులు ఇవ్వడం అన్యాయమన్నారు. లంచాలు తీసుకుని ప్రభుత్వం గనుల తవ్వకాలకు అనుమతులు ఇస్తోందన్నారు. సభావేదికపై జనసేన నాయకులు రేగు మహేష్, కె శివకృష్ణ, ఉత్తరాంధ్ర ప్రతినిది శివశంకర్ పాల్గొన్నారు.

చిత్రం..సాలూరు బహిరంగ సభలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్