రాష్ట్రీయం

మోత్కుపల్లికి ముద్రగడ ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లిని శుక్రవారం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చంద్రబాబు నిచమైన రాజకీయాలు చేస్తాడని మోత్కుపల్లి ఆయన వివరించినట్టు సమాచారం. కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలోకి వచ్చింది, ఎన్టీఆర్‌ను మోసం చేసి పార్టీని హస్తగతం చేసుకొని మహానేత మరణానికి కారణం అయింది, ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యులకు జరిగిన మోసంపై నేతలు ముచ్చటించుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తన నైజం మార్చుకోకుండా ఎన్టీఆర్‌ను మోసగించినట్టుగా కేసీఆర్‌ను సైతం మోసగించేందుకు ప్రయత్నించారని, కాగా ఎంతో విజ్ఞుడైన కేసీఆర్ చంద్రబాబు కుట్రలను చేధించారని ముద్రగడకు వివరించారు. ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు గద్దెనెక్కిన అనంతరం కాపు సమాజానికి, ఏపీ ప్రజలకు చేస్తున్న మోసాలను మోత్కుపల్లికి వివరించారు. అనంతరం ఆయన ఏపీకి రావాల్సిందిగా మోత్కుపల్లిని కోరినట్టు సమాచారం. చంద్రబాబు వ్యవహారంపై కోపంగా ఉన్న ఇద్దరు నేతల బేటి రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకుంది.