రాష్ట్రీయం

దూరప్రాంత సర్వీసుల్లో లింక్ టిక్కెట్ సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: దూరప్రాంత సర్వీసుల్లో లింక్ టిక్కెట్ సౌకర్యాన్ని ఈ నెల 2వ తేదీన ప్రారంభిస్తున్నట్లు టిఎస్‌ఆర్టీసి ఎండి జివి రమణారావు తెలిపారు. ప్రయాణీకుడు దూరప్రాంతానికి రిజర్వేషన్ చేయించుకుంటే దిగిన స్టేషన్ నుంచి తాను వెళ్లే గమ్యస్థానానికి కూడా ముందు తీసుకున్న టిక్కెట్‌తో పాటే లింక్ టిక్కెట్ కూడా జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ సౌకర్యాన్ని 59 దూరప్రాంత రూట్లలో ఎంపిక చేసిన 593 సర్వీసులకు రాష్ట్రంలోని 149 ప్రాంతాల నుంచి కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రయాణీకుడు ప్రయాణిస్తున్న సమయంలో టికెట్‌తో పాటు వారి యొక్క ఏదైనా ఐడి (గుర్తింపు) కార్డును చూపించాల్సి ఉంటుందని తెలిపారు. లింక్ టిక్కెట్ అనేది ప్రధాన ప్రయాణాన్ని, అనుబంధ ప్రయాణాన్ని లింక్ చేస్తుందని పేర్కొన్నారు. లింక్ టిక్కెట్టు ఉన్న ప్రయాణీకులు అరగంట ముందే ప్రధాన సర్వీస్ బయలుదేరే ప్రదేశానికి చేరుకోవాలని, గమ్య స్ధానం చేరుకున్నాక లింక్ టిక్కెట్ వినియోగించుకునేందుకు ఆరు గంటల వరకు సమయం ఉంటుందని వివరించారు. లింక్ టిక్కెట్ సౌకర్యాన్ని ప్రయాణీకులు పల్లెవెలుగు నుంచి సూపర్ లగ్జరీ బస్సుల వరకు ఏ సర్వీసులోనైనా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ లింక్ టిక్కెట్లను ఆర్టీసి ఆన్‌లైన్ సేవ ద్వారాగానీ, అధీకృత ఏజెంట్ల నుంచి గానీ, లేదా త్వరలో అందుబాటులోకి రానున్న టిఎస్‌ఆర్టీసి యాప్ ద్వారా గానీ బుక్ చేసుకోవచ్చని ఎండి ఒక ప్రకటనలో వెల్లడించారు.

చిత్రం..టిఎస్‌ఆరీసీ ఎండి జివి రమణారావు