రాష్ట్రీయం

ఉసురుతీసిన నీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించలేదన్న వేదనతో ఓ విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన జస్లిన్ కౌర్ (18) వైద్య విద్య అభ్యసించాలన్న ఆశతో నీట్ పరీక్షలు రాసింది. అయతే, ఫలితాల్లో ఆమె అర్హత సాధించలేకపోవడంతో మనస్థాపానికి గురైంది. ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే మంగళవారం అబిడ్స్‌లోని మయూరి బహుళ అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మరణానికి సంబంధించిన ఆధారాలు సేకరించి, ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించలేకపోవడమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులూ నిర్థారిస్తున్నారు. జస్లిస్ కౌర్ బహుళ అంతస్తుల భవనం ఎక్కడం, అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయనట్టు పోలీసులు వెల్లడించారు.