రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 5: వేలకోట్ల రూపాయల విలువైన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను చౌకలో కొట్టేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఈ సంస్థ బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే రూ.1100 కోట్లు విడుదలచేసి, అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఈ మొత్తంతో 80శాతం మంది డిపాజిట్‌దారులకు న్యాయం జరుగుతుందన్నారు. ఆ తర్వాత సంస్ధ ఆస్తులను వేలం వేస్తామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా లో పాదయాత్ర చేస్తున్న జగన్ మంగళవారం సాయంత్రం తణుకులో జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడారు. ఈసందర్భంగా అగ్రిగోల్డ్ అంశాన్ని ప్రస్తావించిన జగన్ ఈసంస్ధ ఆస్తులను చౌకలో కొట్టేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఆస్తులను
తొలుత రూ.35 వేల కోట్ల విలువైనవిగా అంచనా వేసి, ఆ తర్వాత సీఐడీ విభాగం ఈ విలువను రూ.10 వేల కోట్లుగా లెక్కించిందన్నారు. ఈ ఆస్తుల కొనుగోలుకు బిడ్ వేసిన ఎస్‌ఎల్ గ్రూపు ఈ ఆస్తుల విలువ కేవలం నాలుగువేల కోట్లు మాత్రమేనని ప్రకటించిందన్నారు. అయితే ఇది అంతా చంద్రబాబు ఆ గ్రూపు ప్రతినిధులతో ఢిల్లీలో అర్ధరాత్రి రహస్యంగా సమావేశమైన తర్వాతే జరిగిందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం తరపున రూ.1100 కోట్లు విడుదలచేసి సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్నారు.
తనకు వాచీ, ఉంగారం, చివరకు మెడలో గొలుసు కూడా లేదని విజయనగరం జిల్లాలో చంద్రబాబు ప్రకటించారని, ఆయన నిజంగానే పేదవాడని జగన్ ఎద్దేవా చేశారు. చేతికి ఉంగరాలు, వాచీలు లేకపోయినా ఎమ్మెల్యేలను కొనడానికి మాత్రం కోట్ల రూపాయలు సొమ్ము ఉందన్నారు. రెండు ఎకరాల ఆసామి నుంచి ఏకంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చంద్రబాబు ఎదిగారన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన హేరిటేజ్ సంస్ధ ఉందని ఆయన గుర్తు చేశారు. ఈసందర్భంగానే ఆయన తన యాసలో మార్పులు చేసుకుని గోదావరి యాసను తన ప్రసంగంలో ప్రవేశపెట్టారు. దీంతో ప్రజలనుంచి మరింత స్పందన వచ్చింది. తణుకు ప్రాంతంలో అధికారపార్టీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోయిందని జగన్ విమర్శించారు.
చంద్రబాబు ఇటీవలకాలంలో చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ చంద్రబాబే సెల్‌ఫోన్ కనిపెట్టాడని, స్ట్ఫావేర్, హార్డ్‌వేర్‌లను కూడా ఆయనే అభివృద్ధి చేశారని, సత్య నాదెళ్లను, పివి సింధూలను తయారుచేసింది కూడా ఆయనేనని వ్యంగ్యంగా వ్యాఖ్యాంచారు. కానీ ఇంతచేసిన చంద్రబాబు తన కుమారుడికి మాత్రం సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ నేర్పించలేకపోయారని పేర్కొన్నారు. అందుకే అందరూ ఆయనను ‘పప్పు’ అంటుంటారని పేర్కొన్నారు. ఏదీఏమైనా చంద్రబాబులా అబద్ధాలు చెప్పేవారిని అసలు నమ్మవద్దని, వచ్చే ఎన్నికల్లో మరిన్ని ప్రలోభాలతో చంద్రబాబు ఓట్ల కోసం వస్తారని, ఇలాంటివారిని బంగాళాఖాతంలో కలిపివేసి తగిన బుద్ధి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఆళ్ల నాని, కారుమూరి నాగేశ్వరరావు, వంకా రవీంద్రనాథ్, పాతపాటి సర్రాజు, ముదునూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.