రాష్ట్రీయం

అవుటర్‌పై లెడ్ వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: అవుటర్ రింగ్ రోడ్‌పై ఎల్‌ఈడి లైట్లు, ప్రతీ పది కిలో మీటర్లకో అంబులెన్స్, ట్రౌమ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. అవుటర్ రింగ్ రోడ్ నగరానికి మణిహారం లాంటిదని, దాని చుట్టూ సాధ్యమైనంత మేరకు ఎక్కువ సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) కార్యకలాపాలపై మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, హెచ్‌ఎండిఏ కమీషనర్ చిరంజీవులు, జిహెచ్‌ఎంసి అదనపు కమీషనర్ భారతి హోలికేరీ తదితర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అవుటర్ రింగ్‌లో ఇంటర్ చేంజ్‌ల వద్ద వే సైడ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకరావాలన్నారు. ఈ దిశగా ఇప్పటికే ఇంటర్ చేంజ్ కేంద్రాల వద్ద కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు దృష్టిసారించినట్టు వివరించారు. అవుటర్ చుట్టూ పెద్ద ఎత్తున గ్రీనరీ పెంచుతున్నామన్నారు. జన సమర్ద్యం ఉన్న ప్రాంతాలను గుర్తించి రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రాంతంలో చేపడుతున్న శిల్పరామం పనులు దసరా నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. హెచ్‌ఎండిఏ చేపట్టిన బాట సింగారం, మండల్‌పల్లిలో లాజిస్టిక్ పార్కల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. నగరం చుట్టూరా 40 చెరువుల అభివృద్ధి కోసం చేపట్టిన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందన్నారు. ప్రతీ పనికీ గడువు పెట్టుకుని పనులను పూర్తి చేయాలన్నారు. హెచ్‌ఎండిఏ పనితీరు, ప్రాజెక్టుల అమలులో తీసుకుంటున్న చర్యలను మంత్రి ప్రశంసించారు. విధులలో మంచి నైపుణ్యం కనబరిచిన ఉద్యోగులను గుర్తించి ప్రోత్సాహాకాలు ఇవ్వాలని కమీషనర్‌ను మంత్రి ఆదేశించారు. సామాజిక మాద్యామాల్లో సంస్థ మరింత భాగస్వామ్యులు కావాలని మంత్రి సూచించారు. హెచ్‌ఎండిఏ అనుమతి పొందిన లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి సత్వరం అనుమతులు వచ్చేలా కొన్ని మార్పులు చేయాలని మంత్రి ఆదేశించారు.