రాష్ట్రీయం

రెండురోజుల్లో రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణకు రెండురోజుల్లో నైరుతీ రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాలకు రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాలు ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఇలా ఉండగా ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 8 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దీనివల్ల రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాల ముందస్తు వర్షాలు అక్కడక్కడా కురుస్తున్నాయి.