రాష్ట్రీయం

ప్రజల భాగస్వామ్యంతోనే.. పర్యావరణ పరిరక్షణ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు మంగళవారం రాష్టవ్య్రాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖలు వివిధ స్వచ్చంద సంస్థలతో కలిసి రాష్ట్ర రాజధానితో పాటు 31జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. నానాటికి పెరుగుతున్న కాలుష్యం భూమండలాన్ని విషపు వలయంగా మారుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పట్టణాల్లో ప్లాస్టిక్ వాడకం అత్యధికంగా ఉండటంతో భూమి, నీరు, వాయివు కాలుషితంగా తయారు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కు, హరిణ వనస్థలీ పార్కుల్లో పర్యావరణం పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమానికి యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా ప్రొఫెసర్ సుజీ లావెల్లే హాజరయ్యారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను యువత తమ భుజానికేత్తుకొని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలని పిలుపు నిచ్చారు. విద్యార్థులు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలంటూ ప్లకార్డులు పట్టుకొని విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. తామొక్కరిమే కాలుష్యాన్ని అడ్డుకోగలమా అన్న సందేహాన్ని వీడి వ్యక్తులుగా ఈ పుడమి కాపాడుకునేందుకు ముందుకు రావాలని అదనపు అటవీ సంరక్షణ అధికారి శోభ పిలుపు నిచ్చారు. ప్రగతి రిసార్ట్‌లో నిర్వహించిన సెమినార్‌లో అటవీ శాఖ ఉన్నతాధికారులు రఘువీర్, డోబ్రియల్‌లు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనభరిచిన విద్యార్ధులకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు.
ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణాన్ని పరిరక్షించడం సాధ్యవౌతుందని పీసీబీ మెంబర్ సెక్రెటరీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సత్యనారాయణ రెడ్డి, బయోడైవర్సిటీ స్పెషల్ సెక్రెటరీ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. రాబోయే తరాలకు నివాస యోగ్యమైన భూ మండలాన్ని అందించేందుకు అందరూ నడుం బిగించాలని కోరారు. గత 60 ఏళ్లుగా పెరిగిన ప్లాస్టిక్ వాడకం తీవ్రమైన కాలుష్యానికి కారణం అవుతోందని చెప్పారు. ప్రస్తుం మానవుని జీవనంలో ప్లాస్టిక్ అంతర్భాగం అయిపోయిందని, ప్లాస్టిక్ లేని ప్రపంచాన్ని ఉహించలేని స్థితికి మానవ జాతి చేరుకోందని అన్నారు. ప్లాస్టిక్‌తో తయారైన పదార్ధాలు భూమిలో కలిసి పోయేందుకు సుమారు 500 నుంచి వెయ్యేలు పడుతుందని అన్నారు. ఈ వ్యర్ధాలను కాల్చడం ద్వారా మరింత ప్రమాదం నెలకొంటుందని, వాటి నుంచి వెలువడే విషయపు వాయివులు వాతావరణాన్ని కాలుష్యకారకంగా మారుస్తోందని పేర్కొన్నారు. ఈ తరహా వెలువడిన వాసనలతో అతి భయంకరమైన వ్యాధులు సోకే ప్రమాదం ఉందని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమండలాన్ని, నీటి వనరులను తీవ్రంగా ప్రభావింతం చేస్తోన్నాయని వివరించారు. హైదరాబాద్ వంటి మహానగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులగా మారడానికి ముఖ్య కారణం ప్లాస్టిక్ వ్యర్థాలేనని తెలిపారు.
రీసైక్లింగ్ ఒక్కశాతమే...
దేశంలో ప్లాస్టిక్ వ్యర్ధాల రీ సైకిల్ ఆశించిన స్థాయిలో జరగక పోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. చరాచర జీవుల మనుగడను ప్రశ్నార్ధం చేస్తున్న ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసి తిరిగి వాడుకవునే అవకాశం ఉన్నా అది జరగడం లేదన్నారు. దేశవ్యాప్తంగా నిత్యం వేలాది టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలు పొగౌతున్నా అందులో ఒక్కశాతం కూడా రీ సైక్లింగ్ ప్లాంట్లకు చేరడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం అవుతోందని అన్నారు.
యువత ముందుకు రావాలి: రాజీవ్ శర్మ
కాలుష్యాన్ని పరిరక్షించేందుకు యువత ముందుకు రావాలని ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పీసీబీ వద్ద నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవుల మనుగడకే ముప్పుగా మారతున్న కాలుష్యంపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పుడమిని రక్షించేందుకు తన వంతుగా బాధ్యతగా వ్యవహరిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సంరద్భంగా మూసి నది వెంట కీలోమీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించిన వివిధ కళాశాలల విద్యార్థులను అధికారులు అభినందించారు.