రాష్ట్రీయం

ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 5: రేపటిలోగా తమ శాసనసభ్యత్వాలను పునరుద్ధరించని పక్షంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై హైకోర్టులో కోర్టు ధిక్కారణ కేసులు దాఖలు చేస్తామని సీఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం నల్లగొండలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు శాసనసభ్యత్వాల రద్దు కేసులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ కొట్టివేయడం సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి చెంప పెట్టువంటిదన్నారు. శాసన సభ్యత్వాల రద్దు సస్పెన్షన్ వివాదాల నేపధ్యంలో మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న తన డిమాండ్‌పై మరింత స్పష్టంగా తాను రెండుమూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి వచ్చాక స్పందిస్తానన్నారు. సభ్యత్వాల పునరుద్ధరణలో కోర్టు ఆదేశాలను పాటించని ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆయన మాదిరిగానే జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు తయారవ్వడంతో పాలన గందరగోళమవుతుందన్నారు. నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్షతను ప్రదర్శిస్తోందని, సిద్ధిపేట మెడికల్ కళాశాలకు 700కోట్లు మంజూరు చేసి నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కళాశాలకు 250కోట్లు మంజూరు చేసిందన్నారు. అలాగే గజ్వేల్‌లో బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి ఐదులక్షలు, నల్లగొండ జిల్లా పిఏపల్లిలో సాగర్ కాలువలో ట్రాక్టర్ ఫల్టీ కొట్టి చనిపోయిన తొమ్మిది మంది గిరిజనులకు, పెండ్లిపాకలలో నీట మునిగి చనిపోయిన ఐదుగురు గిరిజన చిన్నారులకు రెండులక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాలోనూ వివక్షత చూపిన సీఎం కెసిఆర్ ఒక్కడేనంటు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును 80వేల కోట్లతో పూర్తి చేస్తున్నామంటున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులు వైఎస్సార్ హయాంలో తాను ప్రారంభించిన ఎస్‌ఎల్‌బిసి, ఉదయసముద్రం ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఎస్‌ఎల్‌బిసి కట్టపై కుర్చీ వేసుకుని మరి పనులు జరిపిస్తానన్న కేసీఆర్ నేడు నాపై కోపంతో జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వకుండా కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. గతంలో తెలంగాణ కోసం కొట్లాడితే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తన నియోజకవర్గానికి నిధులివ్వకుండా కక్ష సాధింపుకు పాల్పడిందన్నారు. ప్రస్తుతం తన శాసన సభ్యత్వ రద్ధుతో ఎమ్మెల్యే లేకుండా అభివృద్ధి పనులు వెనుకబడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని నియోజకవర్గానికి భారీగా నిధుల సాధన తథ్యమన్నారు. జూన్ 2న 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్న ప్రభుత్వం 2500ఉద్యోగాలకే పరిమితమైందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె న్యాయమైందని, సమ్మెకు తాను, కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ పరిధిలో ఆర్టీసీ కార్మికులు కోరుతున్న 1500కోట్ల చెల్లింపు సమస్యకాదన్నారు. తన నియోజకవర్గంలో రైతుబంధు చెక్కులను ప్రోటోకాల్ లేని వారితో పంపిణీ జరిపిస్త్తూ చివరకు ఎంపి, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తాను కూడా దీనికి రాకుండా అడ్డుకుంటున్న తీరు అధికార పార్టీ బరితెగింపునకు నిదర్శనమన్నారు. కేసీఆర్ బంధువులు నిర్వహిస్తున్న ధరణి వెబ్‌సైట్ తప్పుల తడకని, భూరికార్డుల శుద్ధీకరణ గ్రామాల్లో మరిన్ని సమస్యలకు కారణమైందన్నారు. రైతుబంధుతో రైతులకు ఒరిగేది లేదని మద్ధతు ధర పెంచితేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు బకాయిలు 200కోట్లు ఉన్నాయని వెంటనే వాటిని చెల్లింపుకు చర్యలు తీసుకుని ఖరీఫ్ పంటలకు రైతులకు పెట్టుబడి అందేలా చూడాలని డిమాండ్ చేశారు.