రాష్ట్రీయం

చంద్రబాబు.. వౌనమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 7: రాష్ట్రంలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన భూ సేకరణ చట్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విశాఖ జిల్లా పాడేరులో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కేంద్రం అమలులోకి తెచ్చిన నూతన భూ సేకరణ చట్టం ప్రకారం ఖనిజ సంపదను అడ్డగోలుగా దోచుకునే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తూ అన్నింటినీ నిలదీస్తున్న ముఖ్యమంత్రి ఈ చట్టంపై ఎందుకు మాట్లాడడం లేదంటే ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను దోచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారని ఆరోపించారు.
మన్యంలో ఆదివాసీల సంపదగా ఉన్న బాక్సైట్ ఖనిజాన్ని వెలకితీసి ప్రకృతి సౌందర్యంతో ఉన్న ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్న విజన్ 2050 ప్రకారం మన్యాన్ని నాశనం చేసి ఈ ప్రాంతాన్ని ఏడారిగా మార్చుతారన్నారు. అయితే మన్యానికి అన్యాయం జరిగితే పవన్ చూస్తూ ఊరుకోడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఖనిజ సంపదను దోచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలపై వామపక్ష పార్టీలతో కలిసి ఉద్యమించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. హుకుంపేట మండలం గూడ గ్రామంలో జరుగుతున్న అవినీతి, దోపిడీ తంతు ఇంకెక్కడ జరగాలని పవన్ ప్రశ్నించారు. గూడ గ్రామంలో ఒక నాయకుడు నిబంధనలను తుంగలో తొక్కి చట్టాలను పక్కనపెట్టి అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ఆయన ఆరోపించారు. క్వారీని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రభుత్వానికి చెల్లించాల్సిన తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ఆయన ఆరోపించారు. గూడ గ్రామంలో ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి, గనుల శాఖలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేస్తున్న దీక్షల ఒక్కింటికి కోటి రూపాయలు వెచ్చిస్తున్నారని, చిత్తశుద్ధి లేని ఇటువంటి దీక్షలకు కోట్ల రూపాయలను ఖర్చు చేసే కంటే గిరిజన ప్రాంతంలో నెలకొన్న సమస్యలకు కేటాయిస్తే మంచిదని పవన్ చెప్పారు. ముఖ్యమంత్రి కులాల మధ్య చిచ్చు పెడుతూ విధ్వేసాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. వేర్పాటు వాద ఉద్యమాలు రాకుండా చేస్తారనే విశ్వాసంతో గత ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చానని, అయితే అదే ఉద్యమాలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు.