రాష్ట్రీయం

సాగుకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: గత ప్రభుత్వాల హయాంలో 60 ఏళ్లలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే తాము ఐదేళ్ల పాలనలోనే 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నాలుగేళ్ల వ్యవధిలో పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, వచ్చే ఏడాది మరో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. సాగునీటి రంగంలో నాలుగేళ్ల ప్రగతిపై గురువారం ఖైరతాబాద్‌లోని ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై జరిగిన సదస్సును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషితో పాటు వివిధ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీరు, ఎస్‌ఇలు, ఇఇలు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది, రైతులను ఉద్దేశించి హారీశ్‌రావు ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ ఇంజనీర్‌గా వ్యవహరిస్తూ ప్రాజెక్టులకు రీ-డిజైన్ చేయగా క్షేత్రస్థాయిలో సాగునీటిశాఖ ఇంజనీర్లు, ఉద్యోగులు సైనికుల్లా పని చేశారన్నారు. ఇంతకాలం సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించి బీడు బారిన పొలాలకు నీరు అందించినప్పుడే ఈ శాఖకు సార్థకత చేకూరుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే నాగార్జున సాగర్ చివరి ఆయకట్టుకు
నీరు అందించారని సూర్యాపేటకు చెందిన వెంకటరెడ్డి అనే రైతు ఇదే వేదికపై చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేసారు. నీటి యాజమాన్య పద్ధతులను సమర్థవంతంగా ఇంజనీర్లు అమలు చేయడం వల్లనే సాగునీటి రంగంలో చక్కటి ఫలితాలు వచ్చాయన్నారు. గతంలో ఒక టిఎంసి నీటితో ఐదు నుంచి ఆరు వేల ఎకరాలను సాగు చేస్తే ప్రస్తుతం నాగార్జునసాగర్ కింద ఒక టిఎంసి నీటితో 11,796 ఎకరాలు, పోచంపాడ్ కింద 9,650 ఎకరాలు సాగు చేయగా, నిజాంసాగర్ ప్రాజెక్టు కింద 13,021 ఎకరాలను సాగు చేసి చరిత్ర సృష్టించారన్నారు. ఆన్ అండ్ ఆఫ్, టేల్ టు హెడ్ పద్ధతిలో చివరి ఆయకట్టుకు నీరు అందించగలిగామన్నారు. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, పోచంపాడు ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు నీరు అందించడం తమ ప్రభుత్వం వచ్చాకే జరిగిందని మంత్రి గుర్తు చేసారు. ప్రాజెక్టుల కింద గతంలో కంటే దిగుబడి పెరిగిందని, ఎకరాకు గతంలో 40 నుంచి 45 బస్తాల ధాన్యం పండిస్తే, ప్రస్తుతం 50 నుంచి 55 బస్తాలు పండించగలుగుతున్నారని వివరించారు. సాగునీటి కోసం గతంలో మాదిరిగా రైతులు రోడ్డున పడి ధర్నాలు, రాస్తారోకోలు చేసే పరిస్థితి అధిగమించడమే ప్రథమంగా సాగునీటిశాఖ సాధించిన ప్రగతి అని మంత్రి కొనియాడారు. ఈ ఏడాది 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా వచ్చే ఏడాది మరో పది లక్షల ఎకరాలకు సాగునీటి అందించబోతున్నామన్నారు. ప్రతీ ఎకరాకు సాగునీటి అందించడమే కాకుండా వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతర విద్యుత్ అందించి సిఎం కేసీఆర్ రైతులు హృదాయాల్లో నిలిచిపోయారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుత ప్రయోగంగా మారిందన్నారు. ఈ ఒక్క ప్రాజెక్టు 19 ప్రాజెక్టులతో సమానమన్నారు. కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్నా సిఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీర్లు అంకితభావంతో రాత్రింబవుళ్లు కష్టపడుతున్నారని మంత్రి అభినందించారు. వీరికి సంబంధించిన సమస్యలపై సిఎంతో చర్చించి పరిష్కరిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణంలోనే కాకుండా చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందన్నారు. మిషన్ కాకతీయ పథకంపై అమెరికాకు చెందిన మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు అధ్యయనం చేస్తున్నారన్నారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని ప్రారంభించగా, కర్నాటక ఎన్నికలలో బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో ఈ పథకాన్ని చేర్చిందని మంత్రి గుర్తు చేసారు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో నీటిపారుదలశాఖలో సుదీర్ఖంగా పని చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఈ సందర్భంగా అన్నారు. సాగునీటి రంగం నాలుగేళ్ల ప్రగతి నివేదికను జోషి విడుదల చేశారు.