రాష్ట్రీయం

పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: పోలీసు ఉద్యోగాల్లో చేరేవారికి వయోపరిమితి పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. ఈ మేరకు పోలీసు ఉద్యోగార్థుల వయోపరిమితిన మరో మూడేళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సడలింపు గత నెల 31న తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌లో పేర్కొన్న మూడు కేటగిరీలకు వర్తిస్తుంది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 22 నుంచి 25 ఏళ్లకు, అగ్నిమాపక జైళ్ల శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు 27 నుంచి 30 ఏళ్లకు, మహిళా కానిస్టేబుల్ ఉద్యోగాలకు, జైళ్ల శాఖలో మహిళా వార్డర్ ఉద్యోగాలకు 37 నుంచి 40 ఏళ్ల వరకు వయోపరిమితిని ప్రభుత్వం సడలించింది. వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు, నిరుద్యోగ జేఏసి, రాజకీయ పార్టీల ప్రతినిధులు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. వయోపరిమితి పెంచకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రిక్రూట్‌మెంట్ బోర్డు దిగి వచ్చి వయోపరిమితిని మరో మూడేళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు పంపించాలని స్పష్టం చేసింది. ఈ నెల 9వ తేదీ ఉదయం 8 గంటలనుంచి, 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటలవరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చునని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావుతెలిపారు. అలాగే మరో సవరణను కూడా చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్‌ఐ సివిల్, ఎస్‌ఐ టెక్నికల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు చివరి రాతపరీక్షలో లాంగ్వేజ్ టెస్టు రెండు విభాగాలుగా ఉంటుందని తెలిపారు. తొలి విభాగంలో 25 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, రెండో విభాగంలో 75 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలకు సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చునన్నారు.