రాష్ట్రీయం

దేశంలో కార్పొరేట్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: దేశంలో కార్పొరేట్ అనుకూల పాలన కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దుంభవన్‌లో ఏర్పాటు చేసన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎన్‌డీఏ పాలన-ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్రంగా చర్చించినట్టు చెప్పారు. ఎన్‌డీఏ పాలనలో ఆర్ధిక వ్యవస్థ అస్థవ్యస్థంగా మారిందని, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. భారీగా పెరిగిన ధరలు, జీఎస్‌టి అమలుతో ప్రభుత్వానికి సుమారు రూ. 2లక్షలకు పైగా అదనపు ఆదాయం చేకూరినా సంక్షేమ రంగాలకు కేటాయించడం లేదని మండిపడ్డారు. అతి కీలకమైన విద్య, వైద్య రంగాలకు గతంలో కంటే కేటాయింపులు భారీగా తగ్గాయని తెలిపారు. దేశంలో అచ్చేదిన్ కొంత మందికేనని, అందరికీ కాదన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు.
మోదీ పాలన సబ్‌కా సాత్- సబ్‌కా వికాస్‌లా లేదని, కార్పోరేట్ కా సాత్-కార్పోరేట్ కా వికాస్‌లా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్‌డీఏ సెక్యూలర్ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను ఉదృతం చేయనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా 20న పెట్రోల్ ధరలపై ఆందోళనలు ప్రారంభించి వివిధ అంశాలపై 20 రోజుల పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. పోలీస్ నియామకాల కోసం నిర్ణయించిన వయో పరిమితిని ప్రభుత్వం సడలించాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. చాలా కాలంగా ఎలాంటి నియామక నోటిఫికేషన్లు లేనందున అభ్యర్ధులకు ఈ వెసులు బాటు కల్పించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు.