రాష్ట్రీయం

సీఎం అసహనంతో అధికారుల పల్లెబాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూన్ 7: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భూ రికార్డుల శుద్ధీకరణలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం కోసం అధికార యంత్రాంగం గ్రామాల బాట పట్టింది. భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి ఎక్సలెన్సీ అవార్డులు తీసుకున్న జిల్లా అధికార యంత్రాంగం మరింత ప్రతిష్టాత్మకంగా తప్పొప్పులకు తావులేకుండా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు భేషుగ్గా ఉన్నాయంటూనే ఎక్సలెన్స్ అవార్డుల పరంపరపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లా విద్యా, వైద్యంతోపాటు దాదాపు 12 సంక్షేమ పథకాలలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిపారని జిల్లా ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేసింది. ప్రధానంగా గత రెండు సంవత్సరాల నుండి 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలువడం,్ధన్య సేకరణ,వైద్య సేవలు అందించడం వాటితోపాటుగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ రికార్డులు ప్రక్షాళన వంద శాతం పూరె్తైందని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. కాగా, గత వారం ధాన్యం సేకరణతో పాటు భూరికార్డుల ప్రక్షాళనలో ప్రభుత్వం జిల్లా కలెక్టర్ శరత్,ఆర్డీఓ నరేందర్, తహశీల్లార్ వెంకటేష్‌లకు ఎక్సలెన్సీ అవార్డులు అందించారు. అయితే జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాల అమలులో ముందుండి ఎక్సలెన్సీ అవార్డులు పొందడం, ప్రథమ స్థానం నిలువడం పట్ల, జిల్లా కలెక్టర్ శరత్‌తోపాటు అధికార యంత్రాంగానికి పలువురు అభినందనలు తెలిపారు. ఇది నాణానికి ఒక వైపు కాగా మరో వైపు కొత్తగా ప్రవేశ పెట్టిన తహశీల్దార్లకే రిజిస్ట్రేషన్ బాధ్యత అప్పగించే ఫైలట్ ప్రాజెక్టుగా మండల కేంద్రమైన రాయికల్‌లో ప్రారంభించిన సందర్భంలో ఎమ్మెల్యేగా తన పట్ల జిల్లా కలెక్టర్ శరత్ ఫ్రొటోకాల్ పాటించలేదని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అదే అక్కసుతో జిల్లాలోని ప్రధానంగా భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి తప్పులు దొర్లాయని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇలాగే పలు జిల్లాల్లో తప్పులు దొర్లాయని ఫిర్యాదు అందిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్షించి అధికారులను మందలించి తప్పులు సవరించడానికి ఒక ప్రత్యేకాధికారిని సైతం నియమించారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియాను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు వారం క్రితం జగిత్యాలలో జిల్లా కలెక్టర్ శరత్‌తోపాటు రెవెన్యూ అధికారులతో సమీక్షించి తప్పులు సవరించాలని ఇకపై తప్పులు దొర్లినట్లైతే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. ప్రధానంగా ఈ అంశాలన్నిటినీ ప్రాతిపాదికగా తీసుకొని 3రోజులుగా అవార్డుల ప్రహసనంలో జిల్లా అధికారులపై సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం మెప్పుకోసం వంద శాతం పూరె్తైందని చెబుతూ నివేదికలు సమర్పించి అవార్డులు తీసుకోవడం కాదు..సంక్షేమ పథకాల అమలులో శ్రద్ద చూపించాలని డిమాండ్ చేశారు. భూరికార్డుల ప్రక్షాళన లో తప్పులేలేకుండా వందశాతం పూరె్తైందని అవార్డులు తీసుకోవడం వంద శాతం ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించడం ఈఅంశంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు రాకున్నా లబ్ధిదారుల పట్టించుకోక పోవడం,ప్రతిష్టాత్మకమైన కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల అమలు లో నిర్లక్ష్యం చేస్తూ అవార్డులతోనే మురిసిపోతూ శభాష్ అనిపించుకోవడం తగదని, జిల్లా అన్ని పథకాల్లో ఎక్సలెంట్‌గా ఉందని ఎక్సలెన్సీ అవార్డులు తీసుకోవడం ఏంటని జీవన్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం అందించిన ఎక్సలెన్సీ అవార్డుల పట్ల ఇలాంటి విమర్శలతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.