రాష్ట్రీయం

రహస్య ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జూన్ 7: నరేంద్రమోదీ, కేసీఆర్‌ల మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ కౌసర్ మసీద్‌లో గురువారం రాత్రి కాంగ్రెస్ నాయకులు యంయే జబ్బార్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. ఏ ఒప్పందం లేకపోతే కేసీఆర్ రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్నికల్లో ఎందుకు మద్దతు పలికారని, లోపభూయిష్టంగా వున్న జియస్‌టికి ఎందుకు మద్దతు పలికారని ఆయన ప్రశ్నించారు. రహస్య ఒప్పందం లేకపొతే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాచిగూడ రైల్వేకోచ్ ఫ్యాక్టరీలను సాధించడంలో కేసీఆర్ ఎందుకు నిశ్శబ్దం ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు. మోదీ ప్రధాని అయిన తరువాత దేశంలో ముస్లింలు, క్రిష్టియన్లపై అనేక దౌర్జన్యకర సంఘటనలు జరిగాయని ఆయన ఆరోపించారు. పౌరులు ఏమి తింటున్నారు, ఎవరిని పెండ్లి చేసుకొంటున్నారనే అంశాలపై దేశంలో ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు లేవని మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిపై ఆంక్షలు మొదలయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. మోదీ పాలనలో పలు రాష్ట్రాల్లో మైనారిటీలపై దాడులు, హత్యలు జరగడంతో మైనారిటీలు దేశంలో అభద్రతాభావానికి గురైతున్నారని ఆయన చెప్పారు. మైనారిటీల సంరక్షణ, సంక్షేమం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మోదీని గద్దె దించి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు మైనారిటీలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కేసీఆర్, ఎంఐఎంలకు మోదీని ఓడించే సత్తా లేదని, వారికి ఓటేస్తే మోదీకి ఓటేసినట్లేనని మైనారిటీలు గమనించాలని ఆయన చెప్పారు. ముస్లిం మైనారిటీలకు నాలుగు నెలల్లోనే 12 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు హమీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు అయినా ఎందుకు అమలుచేయడం లేదనిప్రశ్నించారు. కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో మైనారిటీల ఓట్లు అడిగే హక్కులేదన్నారు. కాంగ్రెస్‌కు మద్దతుగా మైనారిటీలు నిలవాలని, రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని ఉత్తమ్ కోరారు. ఇఫ్తార్ విందులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు ఎంఏ జబ్బార్, బషీర్, మున్సిపల్ చైర్‌పర్సన్ వంటిపులి అనిత పాల్గొన్నారు.