రాష్ట్రీయం

రేషన్ డీలర్ల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి రేషన్ షాపులు మూతపడబోతున్నాయి. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వచ్చే నెల నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థను స్థంభింప చేయాలని రాష్టవ్య్రాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు నిర్ణయించారు. దీంతో వచ్చే నెల జూలై నుంచి రాష్టవ్య్రాప్తంగా 17200 రేషన్ షాపులు మూతపడనున్నాయి. దీంతో 2.75 కోట్ల మందికి నిత్యవసర సరుకులు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని శుక్రవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్‌ను కలిసి రేషన్ డీలర్ల ఐక్య వేదిక ప్రతినిధులు స్పష్టం చేసారు. రేషన్ డీలర్లు ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చిన సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటే తప్ప చర్చలు జరిపేది లేదని కమీషనర్ స్పష్టం చేసారు. తమ డిమాండ్లను పరిష్కరించకుండానే సమ్మెను విరమించుకునే ప్రసక్తే లేదని రేషన్ డీలర్లు తేల్చి చెప్పారు. రేషన్ షాపుల ద్వారా వచ్చే నెలలో సరఫరా చేయడానికి సరుకులను తీసుకోవడానికి ప్రభుత్వానికి డీడీలు కట్టకూడదని డీలర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రావ్యాప్తంగా ఉన్న 17200 రేషన్ షాపులు వచ్చే నెల నుంచి మూతపడే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లకు ఇతర రాష్ట్రాలలో చెల్లిస్తున్న కమిషన్ కంటే తెలంగాణలోనే అతి తక్కువ చెల్లిస్తున్నారని, కొన్ని రాష్ట్రాలలో అయితే డీలర్లకు వేతనాలు కూడా చెల్లిస్తున్న విషయాన్ని డీలర్ల సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. గత నవంబర్ నెలలోనే తమకు చెల్లించాల్సిన బకాయిలతో పాటు కమిషన్ పెంచాలని డీలర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం నుంచి స్పందించకపోవడంతో సమ్మెకు దిగుతామని డీలర్ల సంఘం హెచ్చరించింది. డీలర్ల డిమాండ్లను ముఖ్యమంత్రితో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు సమ్మె చేయడం వంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో డీలర్లు అప్పట్లో సమ్మె ప్రతిపాదనను వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో డీలర్లు తిరిగి ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకరావడానికి డీలర్లంతా ఐక్యంగా నిలబడి సమ్మెకు దిగితే తప్ప స్పందించేలా లేదని గత నెలలో డీలర్ల సంఘం హైదరాబాద్‌లో (హయత్‌నగర్) జరిగిన బహిరంగ సభలో ప్రతిజ్ఞ చేసారు. తమ డిమాండ్లను పరిష్కారం పట్ల ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో జూలై నెలకు సంబంధించిన సరుకులకు డబ్బులు చెల్లించడం లేదని డీలర్లు సంఘం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేసింది. దీంతో కమిషనర్ అకున్ సబర్వాల్ డీలర్ల సంఘాన్ని శుక్రవారం చర్చలకు పిలిచారు. సమ్మె నోటీసు ఉప సంహరించుకుంటే తప్ప చర్చలు జరిపేది లేదని కమిషనర్ స్పష్టం చేయడంతో, గతంలో మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేదని డీలర్ల సంఘం గుర్తు చేసింది. తమ డిమాండ్లను పరిష్కరించుకుండా సమ్మెను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని డీలర్ల సంఘం కమిషనర్‌కు తేల్చి చెప్పి సమావేశాన్ని బహిష్కరించింది. డీలర్ల నిర్ణయంతో వచ్చే నెల నుంచి రేషన్ షాపులు మూతపడే పరిస్థితి నెలకొంది.