రాష్ట్రీయం

కన్నతండ్రే కాలయముడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 9: కన్నతండ్రే కాలయముడయ్యాడు. క్షణికావేశంతో తీసుకొన్న నిర్ణయం రెండు ప్రాణాలను బలిగొంది. బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాల్సిన కన్నతండ్రే వారిని కడతేర్చాడు. చిన్నపాటి ఆస్తి వివాదం ఈ దారుణ సంఘటనకు కారణమైంది. ఆస్తి కోసం తల్లితో గొడవపడ్డ కుమారుడు చివరివకు తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి చంపి తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో ఇద్దరు కూతుళ్లు మరణించగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈసంఘటన చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకొంది. గుడిపాల మండలం పిళ్ళారిపల్లికి చెందిన చలపతిరెడ్డి (47) సుమారు 20 సంవత్సరాల క్రితం కుటుంబ సమేతంగా వచ్చి చిత్తూరులోని ఓటి చెరువువద్ద చిల్లర దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కాగా కుటుంబ కలహాల కారణంగా చలపతి భార్య సుమారు ఐదు సంవత్సరాల క్రితం ఆత్మహత్మకు పాల్పడింది. అప్పటి నుంచి చలపతి తన తల్లిదండ్రులు, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. ఈక్రమంలో చలపతిరెడ్డి మద్యానికి బానిసయ్యాడు. తన స్వగ్రామంలో ఉన్న ఆస్తిని తన పేరు మీద రాయాలని చలపతిరెడ్డి తల్లిదండ్రులతో శుక్రవారం ఉదయం గొడవపడి తల్లిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో చలపతిరెడ్డి తల్లి చిత్తూరు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తల్లిపై దాడికి పాల్పడ్డ చలపతిరెడ్డిని పిలిపించి కౌనె్సలింగ్ ఇచ్చి పంపారు. దీంతో మనస్థాపం చెందిన చలపతిరెడ్డి తన కుమార్తెలైన యోగేశ్వరి (15), కుసుమతి (9)లను శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంలో చిత్తూరు రూరల్ మండంల బంగారెడ్డిపల్లికి తీసుకెళ్లి అక్కడ వారికి శీతలపానీయంలో కలిపిన పురుగుల మందు ఇచ్చి తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం ఉదయం బంగారెడ్డిపల్లివాసులు గ్రామ సమీపంలో ముగ్గురు సొమ్మసిల్లి పడి ఉండటాన్ని గుర్తించి వెంటనే చిత్తూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే యోగేశ్వరి, కుసుమతిలు మరణించారని వైద్యులు నిర్ధారించగా, చలపతిరెడ్డి పరిస్థితి విషయంగా ఉంటడంతో వేలూరు సిఎంసికి తరలించారు. ఈ మేరకు చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా చిత్తూరు ఆసుపత్రిలోని మృతదేహాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సన్నపనేని రాజకుమారి, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యాక్షురాలు విజయలక్ష్మి పరిశీలించి మృతుల బంధువులను పరామర్శించారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ అన్యం పుణ్యం ఎరుగని పిల్లలను కడతేర్చడం దారుణమని నన్నపనేని అన్నారు. . టీవీ సీరియల్స్‌లో వస్తున్న కొన్ని సంఘటనలతో ప్రజలు పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలకు సెన్సార్ బోర్డు ఉన్నట్లే టీవీ సీరియల్స్‌కు కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.