రాష్ట్రీయం

మావోల లేఖ అబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ/ హైదరాబాద్ జూన్ 9: దళిత ఉద్యమంలో కాల్పులు జరిపిన ఆర్‌ఎస్‌ఎస్ బలగాలను కాపాడేందుకే ప్రధాని మోదీ హత్య కుట్రను తెరపెకి తెచ్చారని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఒక పథకం ప్రకారం దీనిని రచించారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రొ. హరగోపాల్‌తో కలిసి మాట్లాడారు. కేరేగామ్ దళిత ఉద్యమంలో కాల్పులు జరిపిన వారిని అరెస్టు చేసి శిక్షించాలనే ప్రజా ఉద్యమం తీవ్రంగా పెరుగుతుండడం, గుజరాత్ దళిత ఉద్యమ నేత ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజా స్వామికవాదులను ఒక వేదికపై చేర్చే పనిలో పడడం మోదీకి మింగుడు పడకనేతో ఈ హత్య కుట్రను తెరపైకి తెచ్చారన్నారు. ప్రస్తుతం బహిర్గతం చేసిన ఆ ఉత్తరశైలి మావోయిస్టులు రాసినట్టు లేదని వరవరరావు స్పష్టం చేశారు. నాలుగేళ్లు తన పతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఓ కట్టుకథతో ఓటు బ్యాంకు కింద వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. త్వరలో చత్తీస్‌గఢ్, మహారాష్టల్రో జరగబోయే ఎన్నికల్లో తమ ప్రాబల్యం చాటుకోవడానికి మావోయిస్టు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంతో జాతీయ మీడియా కుమ్మక్కయందని, ప్రజా జీవితంలో ఉన్న వారిని మావోయిస్టు పార్టీ ఎప్పుడైనా లేఖలు రాసిందా అని ప్రశ్నించారు. రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌టాప్‌లో దోరికిక లేఖ అబద్దమని, ఈ లేఖలో తన పేరు ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. పుణే పోలీసులు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేస్తున్నట్లు చెప్పారు. ఇదంతా బీజేపీ రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. వేల సంఖ్యలో ఆదివాసీలను హత్య చేస్తున్నారని, కోరేగాన్ ఘటనకు బాధ్యుడు ఆర్ ఎస్‌ఎస్ కార్యకర్త శంభాజీబిడే అని విమర్శించారు. సురేందర్ గాడ్గిల్, రోనా విల్సన్‌తో తనకు 20ఏళ్ల పరిచయం ఉందన్నారు. ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ రాసినట్లుగా ఆరోపిస్తున్న ఉత్తరాలన్నింటినీ బహిర్గతం చేసి విచారించాలని డిమాండ్ చేశారు. ఆత్మాహుతి దాడులు మావోయిస్టు పంథా కాదని, జాతీయ మీడియా కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుందని విమర్శించారు.