రాష్ట్రీయం

రమణ దీక్షితులుపై కక్ష సాధింపు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 9: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆభరణాలకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తిరుమల ఆలయానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని హంపీ పీఠాధిపతి విద్యారణ్యస్వామి, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కమలానంద భారతి అన్నారు. అనువంశీక అర్చకులకు పదవీ విరమణ లేదన్నారు. రమణదీక్షితులపై కక్షసాధింపు సరికాదని, దీక్షితుల ఆరోపణలు కూడా సమంజసం కాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మఠ, పీఠాధిపతులతో ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలని వారు సూచించారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆలయాల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం నివారించాలంటూ ఇటీవల హైదరాబాదులో మఠ, పీఠాధిపతులు సమావేశమైన విషయం విధితమే. ఇందుకు సంబంధించి ఈనెల 8లోపు ప్రభుత్వం స్పందించాలని, లేదంటే తిరుపతిలో శనివారం మఠ, పీఠాధిపతులు సమావేశం నిర్వహించనున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇందులో భాగంగా హైందవ ఆలయాలపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు సంబంధించి ఒక దిశ, దశ నిర్ణయించడానికి శనివారం తిరుపతిలోని సింధూరి కల్యాణ మండపంలో మఠ, పీఠాధిపతులు, స్వామీజీలు సమావేశమయ్యారు. తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి, హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కమలానంద భారతి, నిర్మాలానంద భారతి, స్వరూపానందగిరి, శివస్వామితోపాటుగా ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నాయకులు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. సమావేశానంతరం మఠ, పీఠాధిపతులు విలేఖరులతో మాట్లాడారు. తిరుమలలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో దేవాలయాల ప్రతిష్టను కాపాడాలంటే ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో మఠ, పీఠాధిపతులు ఉండేలా టీటీడీ యాజమాన్యం చర్యలు చేపట్టాలని, ధార్మిక మండలి సలహాలను తప్పకుండా పాటించాలని డిమాండ్ చేశారు. పాలక మండలిలో అన్యమతస్తులకు స్థానం కల్పించడం సమంజసం కాదని అన్నారు. రమణదీక్షితులు టీటీడీపై ఆరోపణలు చేయడం, దీక్షితులను కొంతమంది టార్గెట్ చేయడం రెండూ తప్పేనని పునరుద్ఘటించారు. టీటీడీ నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించరాదని పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకే ఉపయోగించాలన్నారు. ఇక వజ్రం పగిలే ప్రసక్తేలేదని, ముందుగా దీనికి సంబంధించిన వాస్తవాలను గుర్తించాలన్నారు. ఇందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ నిర్ణయాలను త్వరలోనే ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొన్నారు.