రాష్ట్రీయం

ఏపీలో పాలన అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ళ పాలన వలన చంద్రబాబు కుటుంబానికే ప్రయోజనం చేకూరింది తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. మన్యంలో గిరిజనులు మలేరియాతో అల్లాడిపోతున్నారని, పట్టణాల్లో ప్రజలు డెంగి తదితర వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారని అన్నారు. వీరికి తగిన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. అలాగే రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని, రాజకీయ హత్యలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఇందుకు కారణమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాలమయమైందని ఆయన ఆరోపించారు. ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు జోక్యం ఉందన్న విషయం తేటతెల్లమవుతోందని బొత్స
అన్నారు. ఈ వ్యవహారంలో 12.27 కోట్ల రూపాయలు సింగపూర్‌లోని చంద్రబాబుకు చెందిన వ్యక్తికి చేరిందని ఆయన ఆరోపించారు. గతంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్‌పై ఆరోపణలు వస్తున్నాయని, ఇందులో మంత్రి ప్రమేయమే లేకుంటే, అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించమని లేఖ రాయచ్చుకదా? అని బొత్స ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ అవకతవకలతో సంబంధం ఉన్న ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన రామారావు సంవత్సరం నుంచి ఢిల్లీలోనే తలదాచుకుంటున్నా చంద్రబాబు పసిగట్టలేకపోయారా? అని ఆయన ప్రశ్నించారు. టీటీడీ దేవస్థానంలో నగలు మాయమైపోయాయని రమణ దీక్షితులు ఆరోపిస్తే, చంద్రబాబు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని బొత్స ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారు చంద్రబాబు పాలనలోని లోపాలను ఎత్తి చూపితే, వారిపై ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన అన్నారు. విలేఖరుల సమావేశంలో విశాఖ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీ కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న వైకాపా నేత బొత్స