రాష్ట్రీయం

చంద్రబాబుపై ఎదురుదాడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్టవ్య్రాప్తంగా కొద్దిరోజులుగా బీజేపీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న భౌతిక దాడులు, అనుచిత వ్యాఖ్యలకు ఇక అన్నిస్థాయిల్లో ఎదురుదాడితో చెక్ పెట్టాలని బీజేపీ నిర్ణయంచింది. సోమవారం విజయవాడలో మహా నిరసన ధర్నా నిర్వహించాలని నిర్ణయంచింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన తొలిసారిగా జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఈమేరకు నిర్ణయంచారు. మంగళవారం రాష్టవ్య్రాప్తంగా అన్ని స్థాయిల్లోనూ రాష్ట్భ్రావృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులపై విస్తృత ప్రచారం చేపట్టాలని, 20న దళిత, గిరిజన వాడల్లో సామాజిక సమరసత కార్యక్రమంలో పర్యటించాలని నిర్ణయంచారు. 23న యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించాలని, జూలై 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రతిఒక్కరూ ఒక్కో మొక్క నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా ప్రచారం చేస్తున్న చానెళ్లను బహిష్కరించాలని నిర్ణయించారు. తొలుతగా కన్నా లక్ష్మీనారాయణ తన అధ్యక్షతోపన్యాసంలో సీఎం చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. కొద్దికాలంగా పనిగట్టుకుని బీజేపీ, ప్రధాని మోదీపై దుష్ప్రచారం సాగిస్తున్నారని, పైగా వైకాపా, జనసేనతో సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏదోవిధంగా గెలిచేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం బాబు ఎజెండా ఇదొక్కటేనన్నారు. ఆయన వంటి సంస్కార హీనులు మరొకరుండరని, వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయన నైజమన్నారు. ప్లానింగ్
కమిషన్ చైర్మన్ కుటుంబరావు వంటి వ్యక్తులను చుట్టూ పెట్టుకున్నారని, ఆయన ఒక స్టాక్ బ్రోకర్ అంటూ కన్నా విమర్శించారు. ఇక తెలుగుదేశం పార్టీలోని హత్య కేసు ముద్దాయిలు, మోసపూరిత వ్యక్తులు ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బాబు కూడా ఇలాంటివారినే ప్రోత్సహిస్తున్నారని, వారి ప్రయత్నాలను బీజేపీ శ్రేణులు తిప్పికొట్టాలంటూ కన్నా పిలుపునిచ్చారు. గత నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో సాయం చేసిందని, అయితే ఖర్చుల వివరాలు అడిగినందుకు చంద్రబాబు ఏకంగా ఎన్డీఏతోనే తెగదెంపులు చేసుకున్నారని విమర్శించారు. తప్పుడు లెక్కలతో ప్రజలను ఇంకెంత కాలం మోసగిస్తారని ప్రశ్నించారు. తనకున్న బలమైన ప్రచార సాధనాలతో బీజేపీని దోషిగా చూపుతున్నారని, పైగా అసత్య ప్రచారాలకు నడుం కట్టారన్నారు. బాబు అన్ని కులాల వారిని నిలువునా దగా చేశారని, అందుకే ప్రస్తుతం ఏ కులం వారుకూడా ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇంటింటికీ తాము కరపత్రాలు పంచుతూ తెలుగుదేశం దుష్ప్రచారాన్ని, బాబు మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని, ప్రభుత్వ దుర్నీతిని నిరసిస్తూ రాష్టవ్య్రాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని కూడా కన్నా ప్రకటించారు. సమావేశంలో బీజేపీ జాతీయ సంఘటనా కార్యదర్శి వీ సతీష్‌జీ, జాతీయ మహిళా మోర్చా ఇన్‌ఛార్జి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభా పక్ష నేత పెన్మత్స విష్ణుకుమార్‌రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, 13 జిల్లాల అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.
చిత్రం..బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ