రాష్ట్రీయం

ఇంత అన్యాయమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోటు బడ్జెట్ బకాయిల ఊసే లేదు

రాజధాని నిర్మాణానికీ నిధుల్లేవు
తెదేపా పొలిట్‌బ్యూరో తీవ్ర అసంతృప్తి
ఘర్షణ వైఖరితో సాధించేది ఏంలేదు
కేంద్రంపై ఒత్తిడితో నిధులు రాబట్టాలి
సిఎం చంద్రబాబు దిశానిర్దేశం

విజయవాడ: మొన్నటి రైల్వే బడ్జెట్‌లో, నిన్నటి సాధారణ బడ్జెట్‌లోనూ తెలుగు రాష్ట్రాలను, ప్రధానంగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రను కేంద్రం పూర్తిగా వంచించిందని సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సమావేశం అనంతరం పొలిట్‌బ్యూరో సభ్యులు, మంత్రి యనమల రామకృష్ణుడు, రావుల చంద్రశేఖరరెడ్డి, ఆంధ్ర, తెలంగాణ పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్ రమణ మీడియాతో మాట్లాడారు. కేంద్ర విభజన చట్టంలోని ఏ అంశాన్నీ ఇప్పటివరకు పూర్తిగా అమలుచేయక పోవటాన్ని పొలిట్‌బ్యూరో సమావేశం తప్పుపట్టింది. పలుఅంశాల విషయంలో సిఎం చంద్రబాబు స్వయంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అవసరమైన నిధులను రాబట్టడంలో ఘర్షణ వైఖరి కాకుండా సామ, దాన, భేద, దండోపాయాలతో కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూడా నిర్ణయించారు. ఘర్షణ వల్ల ఒరిగేది శూన్యమంటూ సిఎం ఆగ్రహంతో ఉన్న తోటి పొలిట్‌బ్యూరో సభ్యులను సముదాయించారు. రాష్ట్ర విభజన సమయానికి బడ్జెట్ రూ.16వేల కోట్లు లోటుతో ఉండగా, తొలి ఏడాదే ఆ లోటును కేంద్రం భరించాల్సి ఉన్నప్పటికీ రూ.4,500 కోట్లు మాత్రమే ఇచ్చి తిరిగి ఆ ప్రస్తావన తేవకపోవటంపై సమావేశం నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరును, అలాగే తక్షణ అవసరాలను ఎన్నోమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రస్తుత బడ్జెట్‌లో ఏ ఒక్క ప్రాజెక్టు గురించీ ప్రస్తావన లేకపోవటంపై సిఎం విస్మయం వ్యక్తంచేశారు. గతంలో కేంద్రం రాష్ట్రాలకు తమ ఇష్టానుసారం నిధులు కేటాయించే అవకాశం వుండగా ప్రస్తుతం నీతి ఆయోగ్ ద్వారా విడుదల చేసే నిధులకు రాష్ట్రం తన వాటాను భరించాల్సి రావటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తీరును రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల సమావేశంలో ప్రస్తావించారు. గుంటూరు నగరపాలక సంస్థకు కేంద్రం రూ.850 కోట్లు విడుదల చేసినప్పటికీ నయాపైసా ఖర్చుకాని పరిస్థితి ఏర్పడగా నిధులు మురిగిపోయాయని యనమల చెప్పారు. సంవత్సరాంతంలో నిధుల కేటాయింపు వల్ల ఖర్చు చేసే అవకాశం లభించలేదన్నారు. ఏవిధంగానైనా రైల్వేజోన్‌ను సాధించుకోవాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది.
మేలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 34 ఏళ్లు పూరె్తై 35వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగానూ ప్రజలను చైతన్యపర్చే విశేష కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. నదుల అనుసంధానం ద్వారా మిగులు నీటిని రాయలసీమకు ఏవిధంగా మళ్లించాలనే దానిపైనా చర్చ జరిగింది. ఇటీవల ముగిసిన జన్మభూమిలో కొత్తగా 12 లక్షల రేషన్ కార్డులిచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల జారీలో అక్కడక్కడా కొన్ని లోపాలు జరిగినప్పటికీ వాటిని తక్షణం సరిదిద్దాల్సిన అవసరాన్ని సమావేశం గుర్తించింది. ప్రతిపక్ష నేత జగన్ వ్యవహార శైలిపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. శాసనసభ విధి విధానాలు, నిబంధనలు విస్మరిస్తూ కనీసం రాజ్యాంగం పట్ల కూడా గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ సిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలుగుదేశంలోకి వలసలపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. వారిపట్ల ఎలా వ్యవహరించాలి, వారిని పార్టీ కోసం ఏవిధంగా ఉపయోగించుకోవాలనే దానిపైనా చర్చించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి కూడా అనువర్తించేలా చట్టంలో సవరణ తేవాలని చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవటం వల్ల మొత్తంపై అంగీకారం లభించిందంటూ, దీనివల్ల ముఖ్యంగా తెలంగాణలో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రమణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శిక్షణ తరగతుల వల్ల ఎంతో మేలు చేకూరుతుందంటూ అదేరీతిలో తెలంగాణలో తరగతులు నిర్వహించాల్సి ఉందని రమణ చెప్పారు. రమణ సూచనలు పురస్కరించుకుని సమ్మక్క- సారక్క జాతరను జాతీయ పండువగా గుర్తించాలని, మూడురోజులపాటు సెలవు దినాలుగా ప్రకటించాలని సమావేశం డిమాండ్ చేసింది. కార్యకర్తల సంక్షేమ నిధినుంచి లోకేష్ ఆధ్వర్యంలో బాధితుల కుటుంబాలకు అందుతున్న సహాయం పట్ల సర్వత్రా సంతృప్తి లభిస్తుందంటూ సభ్యులంతా లోకేష్‌ను అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెరగనున్నందున వచ్చే ఎన్నికల్లో యువకులకు 100 సీట్లు కేటాయించాలని సమావేశం నిర్ణయించింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ ప్రకారం కాపు కమిషన్, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటమేగాక ఇటీవల ఏలూరులో సిఎం స్వయంగా రూ.200 కోట్ల మేర రుణాలు అందించటంపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. ఇసుక విధానంపై విస్తృతమైన చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా కట్టుదిట్టమైన పహారా కాయాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దే విషయంపైనా చర్చ జరిగింది. నదుల అనుసంధానం ద్వారా మిగులు నీటిని రాయలసీమకు మళ్లించేందుకు విధి విధానాలు రూపొందించాలని పొలిట్‌బ్యూరో సమావేశంలో నేతలు నిర్ణయించారు.