రాష్ట్రీయం

‘మధ్యతరగతికి నిరాశే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, మధ్య తరగతి వర్గాలను తీవ్ర నిరాశ పర్చిందని ఎపి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. కేంద్రబడ్జెట్‌లో ఎపికి మొండి చెయ్యి చూపించి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. విభజన చట్టం ప్రకారం నిధులు, రాయితీల ప్రసక్తే లేదని, పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించి తీవ్రంగా అవమానించారని రామచంద్రయ్య దుయ్యబట్టారు. రైల్వే బడ్జెట్ మాదిరిగానే కేంద్ర బడ్జెట్‌లో కూడా ఎపికిఅన్యాయం జరిగిందని లోక్‌సత్తా నేత భీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. హోదా ప్రకటించకుండా, పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించడం ఎపికి అవమానమని తెలిపారు.

మార్పు తేలేదు: జెపి

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ యధాస్థితిని కొనసాగించే బడ్జెట్ తప్ప మార్పుని తేగలిగేది కాదని, నిజమైన గొప్ప భారతదేశానికి పునాది వేయగల నాణ్యమైన విద్య, అందరికీ ఆరోగ్యం, పటిష్టమైన చట్టబద్ధపాలన, తేలికగా అందరికీ న్యాయం వంటి కీలకాంశాలను విస్మరించారని లోక్‌సత్తా వ్యవస్థాకుడు జయప్రకాశ్ నారాయణ్ సోమవారం అన్నారు.