రాష్ట్రీయం

పదవీ విరమణ వయోపరిమితి పెంచడం సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: ఏపీఎస్‌ఆర్టీసీలో ఆర్థిక స్థితిగతులు ఆందోళనకరంగా ఉన్నందున ఉద్యోగ, కార్మికుల పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదని మంగళవారం ఆర్టీసీ భవన్‌లో చైర్మన్ వర్ల రామయ్య అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశం స్పష్టం చేసిం ది. సర్వీస్‌లో ఉంటూ చనిపోయిన వారి కు టుంబ సభ్యులకు సంస్థలో ఉద్యోగం ఇవ్వటం కూడా సాధ్యపడనందున రూ.5 లక్షలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించింది. నాలుగేళ్లుగా పాలకమండలి లేనందున సంస్థాగతంగా అధికారులు తీసుకున్న నిర్ణయాలనే పునఃసమీక్షించి అన్నింటికీ ఆమోదం తెలిపారు. వర్ల రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జోన్ చైర్మన్లు పార్థసారధి (విజయవాడ), సుభాష్‌చంద్రబోస్ (నెల్లూరు), ఆర్ అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు ఏవీ రావు, జయరావు, ఎ.కోటేశ్వరరావు, ఆర్థిక సలహాదారు ఎంవీ రావులున్నారు.