రాష్ట్రీయం

200 సీట్లు గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం టౌన్, జూన్ 19: టీడీపీ, వైకాపాలు కేంద్రం వద్ద హోదాను తాకట్టు పెట్టాయని, 2019 ఎన్నికల్లో ఓట్ల కోసం కక్కుర్తిపడి పనిచేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. పోరాటాలు, దీక్షలు చేస్తామంటున్న వారికి 2019 బ్యాలెట్ బాక్సులు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి 200 సీట్లు వస్తాయని అన్నారు. మంగళవారం అనంతపురంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఉప ఎన్నికలు రాకుండా బీజేపీ, జగన్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, ఎంపీలు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు రావన్నారు. కర్నాటక ఎన్నికలు జరుగుతున్నపుడు పది గంటల వ్యవధిలోనే ఇద్దరు లోక్‌సభ సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాయన్నారు. అయితే వైకాపా ఎంపీలు రాజీనామాలు సమర్పించి నెలలు కావస్తున్నా ఆమోదం పొందటం లేదన్నారు. ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలేనన్నారు. టీడీపీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందన్నారు.
నీతి ఆయోగ్‌లో ఎన్నికల కోసమే హోదా గురించి ముఖ్యమంత్రి మాట్లాడారని, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యలు ప్రస్తావించాలని సూచించినా పెడచెవిన పెట్టారన్నారు. అప్పుడు బీజేపీతో జతకట్టి ఆహా ఓహో అన్న వారు ఇప్పుడు నీతి ఆయోగ్‌లో హోదా గురించి మాట్లాడుతున్నారంటే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేనన్నారు. ఈ పార్టీలకు చిత్తశుద్ధి లేదని, అసలైన సమయంలో రాజీనామాలు చేయలేదని రఘువీర ధ్వజమెత్తారు. రాష్టప్రతి ఎన్నికల సమయంలో షరతులు పెట్టాలని సూచించినా ప్రాంతీయ పార్టీలు పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్షం, ప్రభుత్వం 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డ్రామాలాడుతున్నాయన్నారు. ప్రతిపక్షం ఎలాగూ ప్రజాపక్షం వైపు నిలబడలేదన్నారు. కాంగ్రెస్ మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు.
లౌకికవాదం, రాజ్యాంగం, బడుగువర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రఘువీరా అన్నారు. ఈ రోజు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 200 సీట్లు వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ వైకాపా మూడు పార్టీలు ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. ఆ పార్టీలను కాంగ్రెస్ దూరంగా ఉంచుతుందన్నారు. ఓట్ల కోసం సిద్ధాంతాలతో రాజీపడమన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారు, సిద్ధాంతాలతో రాజీపడని పార్టీలతోనే తాము జతకడతామన్నారు. బీజేపీని గద్దె దించి రాహుల్‌గాంధీ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వాన్ని తీసుకురావటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.