రాష్ట్రీయం

దినచర్యలో భాగం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ తమ రోజువారీ కార్యక్రమాల్లో ‘యోగా’ను ఒక భాగంగా చేసుకోవాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగాసనాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతీయ సనాతన ధర్మంలో యోగా, ప్రాణాయామం అతిముఖ్యమైనవని, వీటిని సాధన చేయడంవల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, ముఖ్యకార్యదర్శి హరిప్రీతి సింగ్‌తో పాటు రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన కార్యక్రమంలో కేంద్ర జాతీయ రహదారులు, నౌకాయాన మంత్రి మన్ సుఖ్ ఎల్ మాండవియా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయం ప్రపంచానికి అందించిన గొప్పవరం ‘యోగా’ అన్నారు. ప్రపంచంలోని 175 దేశాల్లో ప్రజలు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, యోగావల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ముస్లింలు రోజూ చేసే నమాజ్‌లో వివిధ భంగిమలు యోగాసనాలవంటివేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న ప్రత్యేక ప్రతినిధి ఎస్. వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యు ఆర్ రెడ్డి ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు స్వామి పతంజలీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అరణ్య భవన్‌లో సిబ్బందితో యోగా గురువు జయప్రకాశ్ నంబార్ యోగా చేయించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ బుద్ధవిగ్రహం వద్ద యోగా తరగతులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో సిఈఓ పౌసమీబసు నేతృత్వంలో జరిగింది. సింగరేణి కంపెనీలోని అన్ని గనుల్లో లక్షా 26వేల మంది కార్మికులు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని వివిధ సంస్థలు, అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున యోగాదినోత్సవం నిర్వహించారు.