రాష్ట్రీయం

శాంతియుత జీవనమేపురోభివృద్ధికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: శాంతియుత జీవనమే పురోభివృద్ధికి మార్గమని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్ యువజన విభాగం చేపట్టిన భారతదేశ ప్రచార బస్సు యాత్ర (మొబైల్ ఎగ్జిబిషన్) హైదరాబాద్ వచ్చిన సందర్భంగా శనివారం మాట్లాడుతూ దేశం కోసం యువత ముందుండాలన్నారు. 2017లో వౌంట్ అబూలో ప్రారంభమైన బస్సు యాత్ర శనివారం హైదరాబాద్ చేరింది. 13 రోజుల పాటు హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. మొబైల్ ఎగ్జిబిషన్ (బస్సు)లో యువతకు సందేశం ఇచ్చేవిధంగా ఫోటోలు ఉన్నాయి. మంచి జీవన విధానం, పరిశుభ్రత, స్వచ్ఛత, స్వచ్ఛ్భారత్ ఉద్దేశం, ఆధ్యాత్మిక విలువలు, వ్యక్తి ప్రవర్తన, యోగా, మెడిటేషన్ తదితర అంశాలపై యువతలో మార్పు తీసుకువచ్చేలా బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, బ్రహ్మకుమారీలు ఉపయోగించే ‘ఓం శాంతి’ పదం మనలో మార్పును తీసుకువస్తుందన్నారు. మన శరీరాన్ని మెదడు ఏవిధంగా కంట్రోల్ చేస్తుందో, మెదడు లేదా ఆత్మను ‘శాంతి’ కంట్రోల్ చేస్తోందన్నారు. నేటి యువత చెడు మార్గానికి సులువుగా ఆకర్షితులౌతున్నారని, వారిని మంచి మార్గంలో నడిపేందుకు ఈ తరహా ప్రచారం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.