రాష్ట్రీయం

రమణ దీక్షితుల ఆరోపణలు అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 24 : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆభరణాలపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో పుట్టాను సన్మానించారు. అనంతరం పుట్టా విలేఖరులతో మాట్లాడుతూ దేశంలోనే ప్రముఖ దేవస్థానమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో 1950లో వున్న ఆభరణాలు అన్నీ భద్రంగా ఇప్పటికీ ఉన్నాయన్నారు. రమణ దీక్షితులు స్వామి వారి ఆభరణాలపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. శ్రీ వేంటేశ్వరస్వామి వారి ఆభరణాలను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకూ లెక్కించి, మీడియా, ప్రజల దృష్టికి తీసుకొస్తామన్నారు. రమణ దీక్షితులు కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకు శ్రీవారి ఆభరణాలు కొన్ని లేవని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో యాదవులకు అధిక ప్రాముఖ్యత ఇస్తూ తనను టీటీడీ చైర్మన్‌గా నియమించారని తెలిపారు.