రాష్ట్రీయం

మెరుగ్గా రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 24: ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీనికి అనుంబంధంగా వాయువ్య బంగాళాఖాతంలో 4.5 నుంచి 5.8 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో చెదురు, మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం మరికొంత చేరువైన పక్షంలో రుతుపవనాలు చురుకుగా కదిలేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం మధ్య భారతదేశంలో రుతుపవనాల ప్రభావం కన్పిస్తుండగా, దక్షిణాదిలో పరిస్థితి నిరాశాజనకంగా ఉంది.