రాష్ట్రీయం

అందనంత ఎత్తులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: అందనంత ఎత్తులో ఇద్దరు విద్యార్థులు తెలంగాణ గౌరవాన్ని నిలిపి అందరి మన్ననలు పొందారు. అందులో ఏడేళ్ల సామాన్యు పోతురాజు ఒకరు కాగా, ఇంకొకరు అజ్మీరా బాబీ. సామాన్యు పోతురాజు టాంజానియాలోని అత్యున్నత శిఖరం కిలిమంజారో అధిరోహించి అత్యంత పిన్నవయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించగా, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణ పొందిన తొలి లంబాడి మహిళగా అజ్మీరా బాబీ రికార్డు సృష్టించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో డీన్ ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ స్కూల్‌లో శిక్షణకు, నివాసానికి, రవాణాకు అయిన మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. కాగా సొంతంగా దాదాపు 15 లక్షల వరకూ ఖర్చు అయినా, రికార్డు సృష్టించాలనే తపనతో సామాన్యు పోతురాజు తన లక్ష్యాన్ని అధిరోహించారు.
కల నిజమాయెగా..
కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన సామాన్యు పోతురాజు చేసిన ట్వీట్‌ను రాష్ట్ర ఐటి మంత్రి కే తారకరామారావు సంతోషంగా ఆమోదిస్తూ, తన కుటుంబ సభ్యులతో సహా వచ్చి తనను కలవొచ్చని సూచించారు. ప్రపంచ రికార్డు సృష్టించడం ద్వారా తను ఇద్దరిని కలవాలని భావిస్తున్నట్టు సామాన్యు పేర్కొన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మూడో తరగతి చదువుతున్న సామాన్యు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను, పవర్ పొలిటీషియన్ టి తారకరామారావును
కలవాలనేదే తన వాంఛ అంటూ పేర్కొనడంతో తన మరో స్వప్నాన్ని సాకారం చేసుకోబోతున్నాడు. సామాన్యు కుటుంబ సభ్యులతో భేటీకి ఏర్పాట్లు చేయాల్సిందిగా తారక రామారావు తన అనుచరులను సోమవారం ఆదేశించారు. మార్చి 29న టాంజానియాలోని 5895 మీటర్ల ఎత్తులోని అత్యున్నత శిఖరం కిలిమంజారో అధిరోహించేందుకు ప్రయాణాన్ని ప్రారంభించిన సామాన్యు వెంట ఆయన తల్లి లావణ్య, కోచ్ తమ్మినేని భరత్, టాంజానియాకు చెందిన ఒక వైద్యుడుతోపాటు మరో శిక్షకురాలు సంగబండి సృజన కూడా ఉన్నారు. వీరంతా ఐదు రోజులపాటు ఎముకలు కొరికే మంచులో ప్రయాణించి ఏప్రిల్ 2న పర్వత శిఖరానికి చేరుకున్నారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా పీక్ అధిరోహించే ప్రయత్నంలో ఉన్న సామాన్యు ఉరకలెత్తే ఉత్సాహంలో ఉన్నాడు.
పైలట్ అజ్మీరా బాబీ
అజ్మీరా బాబీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో కమర్షియల్ పైలట్ శిక్షణ ముగించారు. ఈ శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ట్యూషన్ ఫీజుగా రూ.21,21,215లు, బస చేసేందుకు రూ.3,75,600లు, రవాణా ఖర్చులకు రూ.3,13,000లు కలిపి రూ.28,09,815లను విడుదల చేసింది. ఆమెతోపాటు అడ్వాన్స్ శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సైదా సల్వా ఫాతిమాకు రూ.35.5 లక్షలను విడుదల చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా ఒక రొట్టెల వ్యాపారి కుమార్తె.
మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం కర్నాపేట గ్రామానికి చెందిన అజ్మీరా బాబీ ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ సోషియాలజీ, ఎంబిఏ పూర్తి చేసింది. ప్రైవేటు ఎయిర్‌లైన్స్ సంస్థ నిర్వహించిన లిఖిత, వౌఖిక పరీక్షల్లో ఎంపికైన అజ్మీరా ఫ్లోరిడాలోని 250 ఫ్లయింగ్ అవర్స్ శిక్షణ పొందింది. ఎయిర్‌బస్ 320లోనూ ఆమె శిక్షణ పొంది పూర్తిస్థాయి పైలట్‌గా సిద్ధమైంది. ఇండోనేషియాలోని జకర్తాలో కూడా అనుబంధ శిక్షణను పూర్తి చేసింది. బహుళ ఇంజన్లు ఉండే సెస్నా 170లోనూ, ఒకే ఇంజన్ ఉండే ఎయిర్‌క్రాఫ్ట్‌లోనూ ఆమె శిక్షణ పొందింది. శిక్షణ పూర్తి చేసిన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ కూడా ఆమెకు గుర్తింపును ఇచ్చింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయంతోనే తనకు సాధ్యమైందని అజ్మీరా ఉప్పొంగిపోతోంది.

చిత్రాలు..సామాన్యు పోతురాజు, అజ్మీరా బాబీ