రాష్ట్రీయం

సుజల స్రవంతికి దిక్కేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 25: ఉత్తరాంధ్రలోని బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పం.. ఉభయగోదావరి జిల్లాల తరహాలో ఉత్తరాంధ్రను అన్నపూర్ణగా మార్చాలన్న ఆశయంతో రూపకల్పన చేసిన బాబూ జగ్జీవన్‌రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం నేడు దిక్కూ మొక్కూ లేని దయనీయ స్థితిలో ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుతనాన్ని కొంతైనా తగ్గించి, రైతులను రాజులను చేయాలన్న సదుద్దేశంతో 2009లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈ పథకానికి శంకస్థాపన చేశారు. తొమ్మిదేళ్లు గడిచినా, సుజల స్రవంతి ఒక్క అడుగైనా ముందుకు కదల్లేదు. రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్ట్‌ను ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయే తప్ప, అధికారంలోకి వచ్చిన ఏ ఒక్కరూ కూడా ఈ సాగునీటి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టలేదు.తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు సాగు నీరు అందించే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితికి కారణాలేంటి? ఉత్తరాంధ్ర భూములు బంగారం కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ శిలాఫలకానికే పరిమితమైపోయిందా?
సాయమందని వ్యవసాయం!
ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో ఎక్కువగా సన్న,
చిన్నకారు రైతులే. వ్యవసాయరంగంలో రాష్ట్రంలో విశాఖ జిల్లా 11వ స్థానంలో ఉండగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు 13వ స్థానంలో ఉన్నాయి. ఉత్తరాంధ్రలో 23.24 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతోంది. విశాఖ జిల్లాలో 6.31 లక్షల ఎకరాలకు సాగునీరు ఇప్పటికీ అందడం లేదు. కృష్ణా, గోదావరి డెల్టాలో ఏడాదికి 25 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండుతుండగా, ఉరత్తరాంధ్రలో ఏడు శాతం భూములకు మాత్రమే సాగు నీరు అందుతోంది.
ఉత్తరాంధ్రలోని వ్యవసాయానికి సాయమందించాలన్న ఉద్దేశంతో అప్పటి మంత్రి కొణతాల రామకృష్ణ కచ్చితమైన ప్రణాళికతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వద్దకు వెళ్లారు. వెంటనే ఆయన ఆ ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 2009 ఫిబ్రవరి 21న సబ్బవరం వద్ద ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు బాబూ జగ్గీవన్ రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని నామకరణం కూడా చేశారు. అంతే కాదు, ఆ సంవత్సరం బడ్జెట్‌లో 50 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించేందుకు విశాఖలోరి చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన 50 కోట్ల రూపాయలు కూడా మురిగిపోయాయి.
ఈ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే
సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తయితే, విశాఖ జిల్లాలో 3.21 లక్షల ఎకరాలకు, విజయనగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు, శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలకు మొత్తం ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 1200 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. 53.40 టీఎంసీల నీటిని వ్యవసాయం కోసం, 4.46 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం, 5.34 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించేలా సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతితోపాటు చేవెళ్ల, ప్రాణహితకు కూడా శంకుస్థాపన జరిగింది. 40 వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తే, 12 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు వెళుతుంది. అదే, 7,200 కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నిర్మిస్తే ఏకంగా ఎనిమది లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌ను ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి.
2014 ఎన్నికల సమయంలో టీడీపీ మ్యానిఫెస్టోలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రస్తావించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయింది. ఈ ప్రాజెక్ట్‌పై కనీసం ఒక్కసారైనా సమీక్ష జరపకపోవడం దురదృష్టకరం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ఆరు సాగునీటి ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ఇందులో సుజల స్రవంతి లేకపోవడం శోచనీయం. 2016-17 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్ కోసం కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.
రాజకీయ అడ్డంకులా?
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సమస్యలతోపాటు, రాజకీయ అడ్డంకులే ప్రధాన కారణమని తెలుస్తోంది. సుజల స్రవంతి పూర్తయితే, రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందని, తద్వారా వైసీపీకి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించడం లేదన్న విమర్శలు లేకపోలేదు. ఏది ఏమైనా తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమి సాగులోకి తీసుకువచ్చే ఈ ప్రాజెక్ట్‌ను అటకెక్కించడం దురదృష్టకరం.

2009లో సబ్బవరంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు
శంకుస్థాపన చేస్తున్న అప్పటి సీఎం వైఎస్ (ఫైల్ ఫొటో)