రాష్ట్రీయం

ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ల తిరుగుబాటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేసేందుకు సమాయత్తం అవుతున్నారు. తమను ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమిస్తున్నారంటూ ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లు రగిలిపోతున్నారు. జూనియర్, సీనియర్ అనే తేడాలేకుండా ప్రాధాన్యతలేని పోస్టుల్లో నియమిస్తూ, ఉన్నత వర్గాలకు చెందిన ఐఏఎస్‌లకు కీలక పోస్టులు అప్పగిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులతో పాటు, స్టేట్ క్యాడర్ గ్రూప్-1 అధికారులందరికీ ప్రభుత్వం ఒకే రకంగా ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్సీ,ఎస్టీ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి హోదా కలిగిన బీఆర్ మీనాను ఎస్సీ కమిషన్‌లో సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. ఈ పోస్టులో ఎవరైనా జూన్‌యర్ అధికారిని నియమించినా పని నడుస్తుందని, అలాంటి చోట ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ హోదాకు సమానమైన హోదా కలిగిన అధికారిని నియమించడమేమిటని ఐఏఎస్‌లు నిలదీస్తున్నారు. అలాగే ఎస్సీ వర్గానికి చెందిన మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ మురళిని రాష్ట్ర ప్రాచ్యలిఖిత, బండార సంస్థలో డైరెక్టర్-జనరల్‌గా నియమించారు. ఈ పోస్టులో ఒక జూనియర్ అధికారిని నియమించినా సరిపోతుందని ఎస్సీ,ఎస్టీ ఐఏఎస్‌లు
స్పష్టం చేశారు. సీనియర్ ఐఏఎస్‌లు చంపాలాల్, శర్మన్, భారతి, వైవీ నాయక్ తదితరులను ప్రాధాన్యత లేని వివిధ శాఖల్లో జాయింట్ సెక్రటరీ, డెరెక్టర్ పోస్టుల్లో నియమించారు. రాష్ట్రంలో 31 జిల్లాలు ఉండగా రెండు మూడు జిల్లాల్లోనే ఎస్సీ,ఎస్టీలకు చెందిన ఐఏఎస్‌లను జిల్లా కలెక్టర్లుగా నియమించారు. తమ సర్వీసులకు, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వకుండా అగ్రవర్ణాలకు చెందిన జూనియర్ ఐఏఎస్‌లను జిల్లా కలెక్టర్లుగా నియమించారని వారు తీవ్రంగా మండిపడుతున్నారు. జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పటికీ కనీసం 10 జిల్లాలకైనా ఎస్సీ,ఎస్టీ ఐఏఎస్‌లను కలెక్టర్లుగా నియమిస్తే సామాజిక న్యాయం చేసినట్టయ్యేదని వారు భావిస్తున్నారు. ఎస్సీలకు చెందిన కార్పొరేషన్లకు అదే సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్‌లను నియమిస్తే వారు చిత్తశుద్ధితో పనిచేసే అవకాశం ఉండేదని అంటున్నారు. రాష్ట్రంలో 140 మంది ఐఏఎస్ అధికారులు ఉండగా వీరిలో ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు దాదాపు 40 మంది వరకు ఉన్నారు.
తహశీల్దారులుగా పనిచేస్తున్న 40 మందికి ఆర్‌డీఓలుగా ఇటీవలే ప్రమోషన్లు ఇచ్చారు. వీరిలో 11 మంది వరకు ఎస్సీ,ఎస్టీలు ఉన్నప్పటికీ, వీరిని రెగ్యులర్ ఆర్‌డీఓ పోస్టుల్లో నియమించకుండా ప్రాధాన్యత లేని (లూప్‌లైన్) పోస్టుల్లో నియమించారని, ఉన్నతవర్గాల వారిని మాత్రమే ఆర్‌డీఓలుగా నియమించారని ఈ వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది.
ఇలా ఉండగా రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం గతంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ లకు ఐఏఎస్ అధికారులను ప్రాజెక్ట్ డైరెక్టర్లుగా నియమించేవారు. ఇప్పుడు నాన్-ఏఏఎస్ అధికారులతోనే ఐటీడీఏలను నడిపిస్తున్నారని తీవ్రమైన ఆరోపణ చేశారు. దీనివల్ల గిరిజనులకు న్యాయం జరగడం లేదన్న అసంతృప్తి అధికారుల్లో, ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధుల్లో రగులుతోంది. ఇలా ఉండగా ఎస్సీ సంక్షేమ శాఖకు మంత్రిని కూడా రెడ్డిని (జగదీష్‌రెడ్డి) నియమించడం పట్ల ఉన్నతాధికారుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. సమర్థులైన ఎస్సీ ఎమ్మెల్యేలే ఈ మంత్రి పదవికి దొరకలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
తొలి సమావేశం
బీఆర్ మీనాను కొంత మంది ఎస్సీ,ఎస్టీ ఐఏఎస్ అధికారులు సోమవారం కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తమ పట్ల పక్షపాత వైఖరి చూపిస్తోందని, ఈ పరిస్థితిలో మార్పు వచ్చేందుకు ఏదైనా చేయాలని చర్చించారని తెలిసింది. సోమవారం ప్రాథమిక సమావేశం జరగగా, త్వరలోనే మరో పర్యాయం సమావేశమై అన్ని అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్ కొప్పుల రాజు(రిటైర్డ్) ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఎస్‌సి విభాగం చైర్మన్‌గా ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఆయనతో తెలంగాణకు చెందిన ఒక ఎస్సీ ఐఏఎస్ మాట్లాడి వచ్చాడన్న కారణంతో ఆయనను లూప్‌లైన్ పోస్టులో నియమించారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ పరిస్థితిలో ఎస్సీ, ఎస్టీ సామాజిక న్యాయం జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఐఏఎస్ అధికారులతో పాటు, స్టేట్ క్యాడర్ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.