రాష్ట్రీయం

మేమూ సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. సోమవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. సమావేశానంతరం ఉత్తమ్, కుంతియా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ రోజే గవర్నర్‌ను కలిసి తన పదవికి రాజీనామా చేస్తానంటే వద్దంటామా? అని ప్రశ్నించారు. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరిగినా, ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరిగినా, ఇప్పుడే పెట్టినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎన్నికలు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్నారని తెలిపారు. నిరంకుశ పాలనను తెలంగాణ ప్రజలు ఎంత మాత్రం సహించబోరని వారన్నారు. మూడు సర్వేలు చేయించామని, అన్ని సర్వేల్లోనూ టీఆర్‌ఎస్‌కు వందకుపైగా సీట్లు ఖాయమని తేలిందని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని ప్రస్తావించగా ‘చిల్లర మాటలకు మేం సమాధానం చెప్పం’ అని
అన్నారు. నాలుగేళ్లుగా ఎప్పుడూ ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా పాలన చేసిన ముఖ్యమంత్రి కేసీఆరేనని ఉత్తమ్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ వీడడం బాధాకరమని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌తో దశాబ్దాలుగా దానంకు సంబంధం ఉందని, టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు ఆయన ఆ పార్టీ రాసి ఇచ్చిన స్క్రిప్టును చదివారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్‌లో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఉంటుందన్న విమర్శలను కుంతియా తోసి పుచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టివిక్రమార్క ఉన్నారని, ఏఐసీసీ కార్యదర్శిగా వీ. హనుమంత రావు ఇదివరకే ఉన్నారని, తాజాగా సంపత్ కుమార్‌ను నియమించడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. పైగా ఇప్పటి వరకు పీసీసీకి 37 మంది అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తే అందులో 27 మంది రెడ్డియేతరులేనని కుంతియా పేర్కొన్నారు.

చిత్రం..గాంధీభవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. చిత్రంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సి కుంతియా తదితరులు