రాష్ట్రీయం

శ్రీవారి ఆభరణాలు మహాభద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 25: శ్రీవారి ఆభరణాలు మహాభద్రంగా ఉన్నాయని, భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదని టీటీడీ పాలకమండలి చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అన్నారు. శ్రీవారి ఆభరణాలు పూర్తిస్థాయి భద్రత వ్యవస్థ మధ్య ఉందని, రాములవారి మేడలో భద్రత ఒక పద్మవ్యూహమేనని, దీనిని చేధించడం ఎవరితరం కాదని ఇలాంటి భద్రతా వ్యవస్థను మరే ఆలయంలోను చూడలేమని, రమణదీక్షితులిది తప్పుడు ఆరోపణలు అని, ఆయన భగవంతుడికి క్షమాపణ చెప్పాలని టీటీడీ చైర్మన్ పుట్టా అన్నారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై ఇటీవల ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు ఆరోపణలు, వైకాపా మాజీ శ్రీవారి ఆభరణాల భద్రతపై వైకాపా మాజీ ఎంపి విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేయడంతో పాటు, ప్రభుత్వంపైన, టీటీడీ అధికారులపైన విమర్శలు గుప్పించారు. ఈ నేపధ్యంలో నూతనంగా నియమితులైన పాలకమండలి చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ నేతృత్వంలో సభ్యులు, అధికారులు ఆభరణాల భద్రత విధానాన్ని తనిఖీ చేయడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు మూడు విడతలుగా శ్రీవారి ఆలయంలోని జయవిజయుల గడప దాటిన తరువాత ఉన్న రాములవారి మేడలో భద్రపరిచి ఉన్న ఆభరణాల లాకర్లను, తిరు ఆభరణాల రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. రాములవారి మేడలో ఆభరణాలు భద్రతపరిచి ఉన్న గది చిన్నదిగా ఉండడంతో మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు పాలకమండలి సభ్యులు బృందాలుగా వెళ్లి ఆభరణాలు తనిఖీ చేశారు. అనంతరం ఆలయంలోపల బంగారుబావి ప్రాంతంలో ఉన్న అన్నప్రసాదాలు తయారు చేసే పోటును కూడా వారు పరిశీలించారు.
నేలమాళిగల కోసం పోటులో తవ్వకాలు చేశారని స్వామివారికి అపవిత్రమైన నైవేద్యాన్ని పెట్టారని దీక్షితులు ఆరోపణలు చేసిన విషయం పాఠకులకు విదితమే. అయితే టన్నుల కొద్ది, వేలకోట్ల రూపాయలు విలువ చేసే స్వామివారి ఆభరణాలను కొన్ని గంటల వ్యవధిలో పాలకమండలి తనిఖీ చేసి అంతా భద్రం అని చెప్పడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పాలకమండలి చైర్మన్, సభ్యులు ఆభరణాలను వీక్షించారా? లేక తనిఖీ చేశారా? అన్న ప్రశ్నలను సగటు భక్తులు సంధిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం తిరువాభరణంలో ఉన్న ఆభరణాల జాబితాలో కొన్నింటిని మాత్రమే తనిఖీ చేసినట్లు సభ్యులు విలేఖరుల ముందు చెప్పడమే. ఇదిలా ఉండగా తనిఖీలు అనంతరం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ తిరుమల అన్నమయ్యభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1952నుండి 1996వ సంవత్సరంలో మిరాశి వ్యవస్థ రద్దు అయ్యేంత వరకు ప్రతి శ్రీవారి ఆభరణం తిరువాభరణం రిజిస్టార్‌లో నమోదు అయ్యిందని, అనంతరం టీటీడీ పరిధిలోనికి వచ్చిన తరువాత కూడా అదే విధానంతో ఆభరణాలను భద్రపరుస్తున్నారన్నారు. ఆభరణాలు భద్రపరిచిన లాకర్ వ్యవస్థ అమలు విధానాన్ని చూసి తాము విస్మయం చెందామన్నారు. పెద్దలాకర్‌కు సంబంధించిన తాళాలు, రహస్య నెంబర్ విధానం, డిప్యూటీ ఈఓ స్థాయి అధికారి వద్ద ఉంటాయన్నారు. అటు తరువాత లాకర్ కీ తెరవాలంటే అందుకు సంబంధించి లాకర్, రహస్య నెంబర్ ఏఈఓ స్థాయి అధికారి వద్ద ఉంటాయన్నారు. ఈ రెండు ఉన్నా మరింత రహస్యమైన లాకర్‌కు సంబంధించిన సంఖ్య ఆలయ సూపరింటెండెంట్, అర్చకులకు మాత్రమే తెలిసి ఉంటుందన్నారు. ఆభరణాలు భద్రపరిచి ఉన్న రాములవారి మేడలో అత్యంత అధునాతమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నారన్నారు. గత 15సంవత్సరాల సీసీ కెమెరాల రికార్డులు కూడా ఉన్నాయన్నారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం వెండివాకిలి దాటి స్వామివారి ఆభరణం ఒక్కటి కూడా వెలుపలకు రాలేదన్నారు. ఈ వాస్తవాలన్నీ 25సంవత్సరాలు స్వామివారి కైంకర్యాలు చేసిన రమణదీక్షితులకు బాగా తెలుసునన్నారు. అయితే ఆయన భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. ఆ భగవంతుడు దీక్షితులను క్షమించబోడన్నారు. ఇప్పటికైనా దీక్షితులు తన తప్పులు తెలుసుకుని వెంకన్నకు క్షమాపణ చెప్పి స్వామి కైంకర్యాల్లో తరించాలని హితవు పలికారు. ఒక రూబీ పగిలిపోయిందని, అందుకు సంబంధించిన చిన్నచిన్న పలుకులను కూడా ఒక సంచిలో భద్రపరిచి ఉండడాన్ని గమనించామన్నారు. ఈ రూబీ ధర 50 రూపాయలుగా తిరువాభరణంలో నమోదు చేయబడి ఉందన్నారు. ఇక పోటులో నేలమాళిగల కోసం తవ్వకాలు జరిగాయని చేసిన ఆరోపణలు కూడా స్వయంగా పరిశీలించామన్నారు. అన్న ప్రసాద పోటులో మరమ్మతులు జరిగిన మాట వాస్తవమేనన్నారు. తవ్వకాలు జరగలేదన్నారు. అన్నప్రసాదల తయారీ సందర్భంగా ఉష్ణతీవ్రతకు పురాతన గోడలకు సంబంధించి కొంత దెబ్బతిని ఉన్నాయన్నారు. వాటిని యధాతధంగా ఉంచి, వాటిపైన ఫైర్ రిఫెక్టరీ బ్రిక్స్‌ను అమర్చడం మాత్రమే జరిగిందన్నారు. అలాగే నేడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కట్టడాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నాడు రాతి స్థంభాలతో కట్టడాలు చేశారన్నారు. ఈ క్రమంలో ఒక పిల్లర్ దెబ్బతిని ఉందన్నారు. వీటిని గుర్తించి వాటికి అత్యంత పటిష్టమైన గ్రిడ్స్‌ను సపోర్ట్‌గా ఏర్పాటు చేసినట్టు గుర్తించామన్నారు. పాతకట్టడాల్లో నేలపై తవ్వకాలు జరిగితే కుప్పకూలిపోతాయన్నారు. అలాంటప్పుడు తవ్వకాలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ పనులను కూడా అర్చక కమిటీ, ప్రధానార్చకుల పర్యవేక్షణలో జరిగిందన్నారు. పోటులో కూడా సర్వేలెన్స్‌లు ఉన్నాయన్నారు. ఇంత పటిష్టమైన భద్రత ఉన్నప్పుడు అక్కడ తవ్వకాలు జరిగాయని ఆరోపణలు చేయడం దీక్షితులకు తగదన్నారు. రమణదీక్షితులను ఆగమ సలహా మండలి నుండి కూడా తొలగిస్తారా? అన్న విలేఖరుల ప్రశ్నకు చైర్మన్ స్పందిస్తూ 60సంవత్సరాలు నిండిన అర్చకులను ఉద్యోగ విరమణ మాత్రం చేశామని, అది కూడా 2011లో జరిగిందన్నారు. 40వేల టన్నుల బంగారాన్ని అంత తక్కువ వ్యవధిలో పరిశీలించారా? అన్న ప్రశ్నకు ఎన్ని టన్నులు ఉన్నాయన్న దానిపై తాము పరిశీలించలేదని, తిరువాభరణం రిజిస్టార్‌లో భద్రపరిచిన విధానాన్ని రాండమ్‌గా పరిశీలించామన్నారు. 580, 180 ఇలా సంఖ్యల ప్రకారం వివరాలు పొందుపరిచారని అన్నారు.