రాష్ట్రీయం

జూలై 9 నాటికి డౌన్ స్ట్రీమ్ జెట్ గ్రౌటింగ్ పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జూల్ 9 నాటికి డౌన్ స్ట్రీమ్ జెట్ గ్రౌటింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో పోలవరం సహా 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన అప్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్తి కావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2050 మీటర్లు పొడవున ఉన్న అప్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ నిర్మాణం పూర్తి చేశామని, డౌన్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ పనులు 77 శాతం అయ్యాయని అధికారులు వివరించగా, జూలై 9 నాటికి ఆ పనులు కూడా పూర్తి చేయాలని ఆయన సూచించారు. పోలవరం పనుల పురోగతిపై 65వ సారి ముఖ్యమంత్రి వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేయగా ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 55.73 శాతం పూర్తయిందని అధికారులు వివరించారు. కుడి ప్రధాన కాలువ 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ 61.62 శాతం నిర్మాణం పూర్తయ్యిందని అన్నారు. స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, లెప్ట్ ఫ్లాంక్ తవ్వకం పనులు 75.60 శాతం పూర్తికాగా, స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 27.20 శాతం పూర్తయినట్టు తెలిపారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.22, శాతం కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 90.70 శాతం చేపట్టినట్లు వెల్లడించారు. గత వారం స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెప్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 4.49 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 42 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్‌వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు ఇప్పటి వరకు 843.29 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్‌కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్స ఉండగా ఇప్పటికి 10.01 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18వేల మెట్రిక్ టన్నులకు 11,020 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ‘పునరావాసం - పరిహారం’ కింద ఉద్దేశించిన రూ. 3,115.11 కోట్ల రూపాయల్లో ఇప్పటి వరకు రూ. 219.25 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ఆర్‌ఆర్ పనులు పూర్తవ్వాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్‌ఆర్ ప్యాకేజీ త్వరితగతిన అమలు చేసేందుకు ఐఏఎస్ అధికారులు, నిపుణులతో కూడిన 5 ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరిలో 7 ఆర్‌ఆర్ కాలనీలు, పశ్చిమ గోదావరిలో 19 ఆర్‌ఆర్ కాలనీలు పూర్తయ్యాయని చెప్పారు.
54 ప్రాజెక్టులలో మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పెదపాలెం, చినసేన, పులకుర్తి, అవుకు టనె్నల్, గోరకల్లు రిజర్వాయర్, పులికనుమ ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యాయని చెప్పారు. కొండవీటి వాగు ప్రాజెక్టు జూలై 15 నాటికి పూర్తికానుందని, జూలై 31 నాటికి కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతుందని అన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ పనులు తుదిదశకు చేరాయని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్, నెల్లూరు - సంగం బ్యారేజీలు ఆగస్టు 31 నాటికి పూర్తి కానున్నాయని వివరించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ముల్లపల్లికి నీటి సరఫరా ప్రారంభమవుతుందని తెలిపారు. మల్లిమడుగు, బాలాజీ, వేణుగోపాల సాగర్ రిజర్వాయర్లు నిర్మాణం కోసం అటవీ భూముల సమస్యను పరిష్కరించాలని అటవీశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు స్టేజ్ 2, రెండో దశ పనులు పూర్తి చేసి 5 టీఎంసీల నీటిని జూలై 15కి నిల్వ చేయాలని చెప్పారు. ఆగస్టు 15 నాటికి ప్రాధాన్య ప్రాజెక్టుల్లో మిగిలిన అన్ని ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
19 స్కోచ్ అవార్డులపై అభినందనలు
జలవనరుల శాఖకు 19 స్కోచ్ అవార్డులు రావడంపై అధికారులకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. నీటి పారుదల రంగంలో ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’ కింద ప్లాటినమ్ అవార్డు జలవనరుల శాఖ పనితీరుకు, భూగర్భ జలాల నీటిమట్టాలను పర్యవేక్షణకు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, నీరు - చెట్టు పథకానికి ప్లాటినం అవార్డులు దక్కాయి. ఏపీడబ్ల్యుఆర్‌ఐఎంఎస్, పురుషోత్తపట్నం, గండికోట, ముచ్చుమర్రి, ఏపీఎస్‌ఐడీసీకి స్వర్ణ పురస్కారాలు, ఎత్తిపోతల పథకాల వెబ్ అధారిత పర్యవేక్షణకు కాంస్య పురస్కారాలు వచ్చాయి.
ఒక శాఖ 19 స్కోచ్ పురస్కారాలు పొందడం అరుదైన ఘనతగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ అవార్డులు జలవనరుల శాఖకు, ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ‘అవార్డులతో దేశానికి ఆదర్శంగా నిలిచాం, మరింత స్ఫూర్తినిచ్చాయి. బాధ్యత పెంచాయి. ఇకపై ప్రతి ఎకరాకు నీరివ్వాలనే తదుపరి లక్ష్యంపై దృష్టి పెడదాం. అనుకున్నట్టుగా 54 ప్రాజెక్టులు, పంచ నదుల మహాసంగమం, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి పూర్తి చేసే రాష్ట్రం సస్యశ్యామలం అవుతాయి’ అని ముఖ్యమంత్రి అన్నారు. సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జీ సాయిప్రసాద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎస్‌సీ వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
చిత్రం..పోలవరం, ఇతర ప్రాజెక్ట్‌లపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు