రాష్ట్రీయం

బాబువన్నీ మాటలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 26: ఎన్నికల ముందు అమలుకాని హామీలెన్నో ఇచ్చి, అవి పూర్తికాకుండానే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు మరోసారి రియల్ ఎస్టేట్ వ్యాపారి తరహాలో మోసపూరిత సినిమా చూపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎద్దేవాచేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ప్లాట్లు అమ్ముకోవడానికి అదుగో ఎయిర్‌పోర్టు, ఇదుగో రింగు రోడ్డు, ఇక్కడే ఐటీ హబ్ అంటూ మోసం చేస్తాడని, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అదే తరహాలో గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలకు అదుగదుగో సింగపూర్, అదిగదుగో ఆరు నెలలు, ఏడాదిలో పోలవరం, ఇక్కడే ఐకానిక్ టవర్, ఆ పక్కనే ఐకానిక్ బ్రిడ్జి, బుల్లెట్ ట్రైన్,
హైపర్ లూప్ అంటూ బ్రహ్మాండమైన గ్రాఫిక్స్‌తో సినిమా చూపిస్తున్నారని అన్నారు. అమలాపురంలో మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ తాను చిటికేస్తే రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని, అనంతపురం కరవును రెయిన్ గన్స్‌తో జయించామని, డ్రోన్లతో దోమల మీద యుద్ధం చేశామని చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దేశంలో 7 శాతం అభివృద్ధివుంటే, మన రాష్ట్రంలో 11 శాతం అభివృద్ధి సాధ్యపడిందని మభ్యపెడుతున్నారన్నారు. కానీ వాస్తవంగా రాష్ట్రంలో దుష్టపాలన వల్ల రుణాలు అందక, గిట్టుబాటు ధర లభించక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగులు ఆకలి కేకలు వేస్తున్నారని, గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీలతో ఒక మాఫియా తయారవ్వడంతో ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా కనివీనీ ఎరుగని అవినీతి, అరాచకాలు రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గత నాలుగేళ్లుగా కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని జగన్ దుయ్యబట్టారు.
నాలుగేళ్లుగా ఏ సమస్యను పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఏమిచేసినా ఎన్నికలకు ఆరు నెలల ముందు, నాలుగు నెలలకు మాత్రం’ అనే కొత్త టైటిల్‌తో అందరికీ వరాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఈ వరాలు చంద్రబాబు పాంప్లెట్ అయిన ‘ఈనాడు’ పత్రికలోనే కనిపిస్తాయన్నారు. ఒకపక్క సంక్షేమ హాస్టళ్లను రేషనలైజేషన్ పేరుతో మూసివేస్తూ, మరోపక్క హాస్టల్ విద్యార్థులకు కోడి కూరతో భోజనం పెడతామని ప్రకటించడం దారుణమన్నారు. నాలుగేళ్లుగా ఒక్క ఇల్లు కూడా నిర్మించని ముఖ్యమంత్రి తాజాగా రూ.500 కోట్లతో ప్రైవేటు భూములు కొని, ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించడం ప్రజలను మోసగించడానికే అన్నారు. అలాగే గతంలో అంగన్‌వాడీలపై లాఠీఛార్జి చేసి, కేసులు పెట్టిన ముఖ్యమంత్రి తాజాగా జీతాలు పెంచుతానని ప్రకటిస్తున్నారని, నాలుగేళ్లుగా గుర్తురాని నిరుద్యోగ భృతి ఇప్పుడే గుర్తుకువచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి తదితర ప్రకృతి వనరులన్నితో పాటు, రాజధాని భూములు, గుడి భూములు, గుడిలోని దేవుళ్ల నగలను కూడా దోచేస్తున్నారన్నారు. మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తానని హామీయిచ్చి, అడిగితే తాట తీస్తానని బెదిరిస్తున్నారన్నారు. నారుూబ్రాహ్మణులు తమ సమస్యలు తీర్చమని అడిగితే తోక కత్తిరిస్తాను అని బెదిరిస్తున్నారన్నారు. ఇన్ని రకాలుగా మోసాలు చేసి, అబద్ధాలు చెప్పే చంద్రబాబును నమ్మవద్దని ప్రజలను కోరారు. చంద్రబాబులో మార్పు రాదని పేర్కొంటూ ‘ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు కాదు... కొయ్యబొమ్మను తెచ్చి ఎంత కొట్టినా ఉలకదూ పలకదు’ అనే వేమన శతకం ఆయనకు అతికినట్టు సరిపోతుందని జగన్ ఎద్దేవాచేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం ప్రస్తుతం ఆయన ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే నిరాహార దీక్షలు చేస్తున్నారని, నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి ప్రయాణం చేసినపుడు ఈ ఫ్యాక్టరీ ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవరత్నాల్లో భాగంగా అవ్వా తాతలకు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛను రూ.2000 వంతున అందిస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మహిళలకు 45 ఏళ్లకే రూ.2000 పింఛను ఇస్తామని ప్రకటించారు.

చిత్రం..తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న జగన్