రాష్ట్రీయం

కోర్టు తీర్పుపై విపక్షాల హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: బీసీల రిజర్వేషన్లను శాస్తబ్రద్ధంగా చేయకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికీ, అన్ని పార్టీలకూ సెమీ ఫైనల్‌లా ఉండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
తీర్పును స్వాగతిస్తున్నాం
టి.పిసిసి నేత డాక్టర్ శ్రవణ్
కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టి.పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసోజు మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పును స్వాగతించారు. అయితే ప్రభుత్వం హైకోర్టు తీర్పునైనా గౌరవించి బీసీల్లో కులాల వారీగా జనాభా లెక్కలు చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీల్లోని ఉప కులాలకలు రాజకీయంగా న్యాయం జరుగుతుందన్నారు. గతంలో
ఈ విషయానే్న తాము ప్రభుత్వానికి చెప్పినా పెడ చెవిన పెట్టడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
ప్రభుత్వ కుట్ర..
ఎమ్మెల్సీ రాంచందర్ రావు
పంచాయతీ ఎన్నికలు ఎలాగైనా వాయిదా పడాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేసిన కుట్ర ఇది అని శాసనమండలి బిజెపి పక్ష నేత ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. ప్రభుత్వమే ఈ అంశంపై ఇతరులు కోర్టుకు వెళ్ళేలా వెసులుబాటు కల్పించిందనీ, ఇదంతా చూస్తుంటే ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి లేదని స్పష్టమైందన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వరకూ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వ యోచన అనిపిస్తున్నదని, తొలి నుంచీ బిజెపి రాష్ట్రంలో బీసీల సమగ్ర సర్వే నిర్వహించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. జనాభా నిష్పత్తి ప్రకారం వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలే తప్ప ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు.
ఒంటెద్దు పోకడలు మానుకోవాలి
సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి
పంచాయతీ ఎన్నికల విషయమై కోర్టు స్టే విధించిన నేపథ్యంలోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఒంటెద్దు పోకడలను మానుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సూచించారు. గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో శాస్ర్తియంగా వ్యవహరించాలని ఆదేశించినా వాటిని పక్కన పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ అశాస్ర్తియ విధానాలే ప్రస్తుత అడ్డంకికి కారణమైందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా సీఎం తన తీరును మార్చుకొని అన్ని వర్గాల వారితో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా ఈ అంశంపై స్పందించడానికి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిరాకరించారు. కోర్టు తీర్పు సారాంశాన్ని పూర్తిగా చదివాకే స్పందిస్తామన్నారు.