రాష్ట్రీయం

రేపటితో సరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: రేషన్ షాపుల బంద్‌కు సమ్మె నోటీసు ఇచ్చిన డీలర్లకు ప్రభుత్వం తాజాగా గురువారం వరకు గడువు విధించింది. గురువారం సాయం త్రం వరకు సరుకులు తీసుకోవడానికి డిడీలు చెల్లించని డీలర్‌షిప్‌లను రద్దు చేయనున్నట్టు పౌర సరఫరాలశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 28 వరకు డీడీలు చెల్లించని డీలర్‌షిప్‌లను తెలంగాణ ప్రజాపంపిణీ వ్యవస్థ కంట్రోలర్ ఆర్డర్ 2016 ప్రకారం రద్దు చేసి కొత్త వారిని నియమించనున్నట్టు పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తూ సమ్మె చేయడం చట్టవిరుద్దమని గుర్తు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ సరుకులు అందుతాయో లేదోనని పేదప్రజలు ఆందోళన చెందవద్దని, సకాలంలో సరుకులను అందజేయడానికి ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇలా ఉండగా రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీకి అపతీ నెలా 20వ తేదీ వరకు మీ-సేవా కేంద్రాల ద్వారా డీలర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ప్రభుత్వానికి సమ్మె నోటిసు ఇవ్వడంతో డీలర్లు డిడీలు చెల్లించలేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మాదిరిగా డీలర్లకు వేతనాలు ఇవ్వాలని, పాత బకాయిలను చెల్లించాలన్న ప్రధాన డిమాండ్లతో డీలర్లసంఘం సమ్మె నోటిసు ఇచ్చిన విషయం
తెలిసిందే. డిమాండ్లను అధ్యాయనం చేయడానికి ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తామని, అప్పటి వరకు సమ్మె విరమించాలని డీలర్ల సంఘంతో జరిపిన చర్చల సందర్భంగా కమిషనర్ హామీ ఇచ్చారు. అయితే గతంలో ఇలాగే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, దీంతో ఈ సారి డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని డీలర్ల సంఘం స్పష్టం చేసింది. తమ పిలుపు మేరకు ఇప్పటి వరకు 17200 మంది డీలర్లలో ఎవరు కూడా డిడీలు చెల్లించలేదని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు. అయితే తమకు 300 డిడీలు అందినట్టు పౌరసరఫరాలశాఖ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఖండించారు. కొందరు అధికారులు డిడీలు తీసి వాటిని డీలర్లు చెల్లించినట్టుగా చిత్రీకరించి సమ్మెను విచ్ఛినం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు. డీలర్‌షిప్‌లు రద్దు చేయనున్నట్టు చేస్తోన్న హెచ్చరికలకు డీలర్లు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసారు.