రాష్ట్రీయం

ఫెడరల్ ఫ్రంట్ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తనకు తానే చాలా తెలివైనవాడినని అనుకుంటున్నారని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి చురక వేశారు. అందరినీ మోసం చేయగలనని కేసీఆర్ అనుకుంటున్నారని, అయితే అది ఎల్లప్పుడూ సాధ్యం కాదని గుర్తుంచుకోవాలని మంగళవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో జైపాల్ అన్నారు.ఎన్నికలు పూర్తయిన తర్వాత కేసీఆర్ పని పడతాం అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో హడావుడి చేసిన ఫెడరల్ ఫ్రంట్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీతో దోస్తీ చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో బిజెపి బలహీనంగా ఉందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పెట్రోలు ధరలు ఆకాశానికి అంటుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశా రు. పెట్రోలుపై విధిస్తున్న పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించలేకపోతున్నదని ఆయన విమర్శించారు. పెట్రోలుపై వస్తున్న పన్నుల ద్వారానే ద్రవ్య లోటును భర్తీ చేసుకోవాలనుకోవడం దారుణమని అన్నారు. పెట్రోలు రేట్లు పెరిగితే దాని ప్రభావం అన్ని వస్తువులపైనా పడుతుందని ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో
దూషిస్తున్న వారిపై పోలీసులు చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక హిందూ-ముస్లిం జంట పాస్ పోర్టు విషయంలో రీ=వెరిఫికేషన్ చేసి వివక్ష చూపారని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ అనుచరులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనుచరులు పత్రికల్లో రాయలేని పదాలతో సోషల్ మీడియాలో విమర్శించారని జైపాల్ రెడ్డి తెలిపారు. బిజెపిలో చదువుకున్న వారు లేరని, పేదల గురించి ఆలోచించే వారు లేరని ఆయన విమర్శించారు. బిజెపిలో పుట్టినవారంతా రాక్షసులని ఆయన అంటూ లంకలో పుట్టిన వారంతా రాక్షసులేనని అన్నారు. అయితే జైపాల్ రెడ్డి వెంటనే నాలిక కరచుకుని దీనిని సామెతగానే అన్నానని చెప్పారు. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ కుటుంబంలో జన్మించిన వారేనని ఆయన తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం తమదేనని అన్నారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని జైపాల్ రెడ్డి ధీమాగా చెప్పారు.