రాష్ట్రీయం

ఇక విద్యుత్ వాహనాల రయ్ రయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: నానాటికి ఇంధన వనరులు తరిగిపోతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా విద్యుత్‌తో నడిచే వాహనాలను తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు ప్రారంభించింది. ఇది సాకారమైతే హైదరాబాద్‌లో విద్యుత్ వాహనాలు నడిచే కాలం ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు. మరి విద్యుత్ వాహనాలకు రీచార్జ్ సదుపాయం కీలకమైన అంశం. విద్యుత్‌తో నడిచే వాహనాలకోసం రీచార్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఏమేరకు విద్యుత్ సరఫరా చేయగలరని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ మేరకు ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి తెలంగాణ విద్యుత్ నియంత్రణ సంస్థ ( ఈఆర్‌సి)చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్‌తో ఆయన చర్చలు జరిపారు. ఈఆర్‌సి చైర్మన్‌కు విద్యుత్ ధరలు ఏమేరకు నిర్ణయించాలన్న దానిపై సిఎండి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తొలుత హైదరాబాద్‌లో ఏఏ ప్రాంతాల్లో విద్యుత్ రీచార్జి కేంద్రాల ఏర్పాటు చేయాలన్న అంశంపై మంత్రి కేటీఆర్ అధికారులతో రేపోమాపో చర్చించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ పంపు కేంద్రాలు విద్యుత్ రీచార్జి కేంద్రాలకు అనువుగా ఉంటాయా లేదా అన్న అంశాలపై అధ్యయనం చేయనున్నారు. విద్యుత్ వాహనాలు తొలుత హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. హైదరాబాద్ మెట్రోరైలు యాజమాన్యం తొలి ప్రయత్నంగా మియాపూర్ వద్ద ద్విచక్ర వాహనాలతో పాటు కార్లకు విద్యుత్ రీచార్జి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈమేరకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో మెట్రోరైలు యాజమాన్యం ఒప్పందాలు కుదుర్చుకుంది. త్వరలో అన్ని మెట్రోరైలు స్టేషన్ల వద్ద విద్యుత్ రీచార్జి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది. ప్రస్తుతం కార్లకు విద్యుత్ రీచార్జి చేయడానకి 90 నిమిషాల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు కొంత అసహనానికి
గురవుతున్నారు. రీచార్జి 4 లేదా 5 నిముషాల్లో పూర్తయ్యేలా చూడాలని వారు కోరుతున్నారు. కిలోవాట్‌కు ఎంత ధర వసూలు చేయాలన్నది తర్వాత నిర్ణయిస్తారు. దూరాలను బట్టి విద్యుత్ చార్జిల ధరలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి బ్యాటరీ లేదా పవర్ సాకేట్‌కు విద్యుత్ చార్జి చేస్తే ఆ వాహనం 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఒక బ్యాటరీ లేదా రెండు బ్యాటరీలను వాహనానికి అమర్చుకోవచ్చునా అన్నది అధ్యయనంలో తేలనున్నది. దేశ వ్యాప్తంగా 4వేల విద్యుత్ రీచార్జి కేంద్రాల ఏర్పాటుకు ఈఈఎస్‌ఎల్ (ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీస్ లిమిటెడ్) సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే దీనికి పెద్దగా స్పందన లభించకపోవడంతో మళ్ళీ దరఖాస్తులను ఆహ్వానించంది. తొలుత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించే వాహనాలకు విద్యుత్ బ్యాటరీలు అమర్చి ప్రయోగాత్మగకంగా అమలు చేసి దీనిపై ప్రజల స్పందనను అంచనా వేయవచ్చని అధికారులు చెబుతున్నారు. నాగపూర్‌లో విద్యుత్‌తో నడిచే వాహనాలే రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం మహేంద్ర, లెక్సెస్, టాటా కంపెనీలు విద్యుత్‌తో నడిచే వాహనాలను రూపొందిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 423 విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉన్నాయని వీటితో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ రీచార్జి కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చునని డిస్కం అధికారులు గుర్తు చేస్తున్నారు. అలాగే జంట నగరాల్లో ఉన్న టౌన్‌షిప్ ఏరియాలను కూడా పరిశీలిస్తున్నారు.