రాష్ట్రీయం

మోదీ ఏమీ ఇవ్వరు.. ఆయనంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నీ ఇస్తామని, విభజన బిల్లులోని 18 అంశాలను నెరవేరుస్తామని ప్రధాని మోదీ చెప్పారని, కానీ ఇంతవరకు ఏమీ ఇవ్వలేదని డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అన్నారు. ఆయన అంతేనని, ఏదీ ఇవ్వరని, మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనని విమర్శించారు. కడప ఉక్కు కోసం ఏడు రోజులుగా దీక్ష చేస్తున్న సీఎం రమేష్‌నాయుడు, బీటెక్ రవిని ఆమె మంగళవారం పరామర్శించి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, తమ తండ్రి కరుణానిధి, సోదరుడు స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారన్నారు. వారి మద్దతు చంద్రబాబునాయుడుకు ఉంటుందని స్పష్టం చేశారు. మోదీ చెప్పింది ఏదీ చేయరని, ఆయన స్వభావమే అంత అని ఆమె విమర్శించారు. ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఎకనామికల్ జోన్‌గా మారుస్తానని ఇచ్చిన హామీని ఉద్దేశపూర్వకంగానే ఎగవేశారని ఆరోపించారు. నోట్ల రద్దు ఒక పెద్ద కుంభకోణమని ఆరోపించారు. జీఎస్‌టీ పన్ను విధానం వల్ల కొనుగోలుదారులకు ఒరిగిందేమీలేదన్నారు. మోదీ చర్యలన్నీ ధనవంతులకు మేలు చేసేవేనని అన్నారు. మోదీని నమ్మి దేశ ప్రజలు బీజేపీకి ఓటు వేశారని, ఆయన అధికారం చేపట్టాక అసలు స్వరూపం తెలుస్తోందన్నారు. హిందీ, హిందుత్వ, గుజరాత్ తప్ప మోదీకి దేశప్రయోజనాలేవీ గుర్తులేవని ఆరోపించారు. మతం, కులం పేరుతో దేశ ప్రజలను బీజేపీ ప్రభుత్వం చీలుస్తోందని ఆరోపించారు. తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి గ్రామంలో పర్యావరణ కాలుష్యానికి కారణమైన కాపర్ పరిశ్రమ విస్తరణను నిలిపివేయాలని రైతులు ఆందోళన చేస్తే వారిపై కాల్పులు జరిపించి 13 మంది మరణానికి మోదీ కారణమయ్యారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ విధానాల పట్ల అన్ని రాష్ట్రాలు విముఖంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ఇది సరైన తరుణమని ఆమె ఉద్ఘాటించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలుకలిసి జాతీయస్థాయిలో పోరాడాల్సి ఉందన్నారు. ఇక్కడ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ ఏడురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నా, కేంద్రం స్పందించకపోవడం దారుణమని అన్నారు.

చిత్రం..ఉక్కు దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి