రాష్ట్రీయం

గంజాయి స్మగ్లర్ల మూలాలు శోధిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 26: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాతో ప్రమేయం ఉన్న స్మగ్లర్ల మూలాలు శోధించి వారి ఆటకట్టించే విధంగా ముందుకు సాగుతున్నామని సీఐడీ అదనపుడీజీ ఆమిత్ గార్గ్ వెల్లడించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో భాగంగా విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్మగ్లర్ల ఆచూకీ కోసం ఆయా రాష్ట్ర పోలీసు యంత్రాంగంతో చర్చిస్తున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయడం ద్వారా గత రెండేళ్లలో గంజాయి సాగును అరికట్టగలిగామన్నారు. గంజాయి సాగు, స్మగ్లింగ్ వంటి నేరాలకు తరచు పాల్పడుతూ పట్టుబడిన వారిని గుర్తించి, పీడీ యాక్టును అనుసరించి కేసులు నమోదు చేయనున్నట్టు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన గంజాయి స్మగ్లర్లు స్థానిక గిరిజనులు, నిరుద్యోగులను ఆకర్షించి నేరస్తులుగా మారుస్తున్నారన్నారు. అమాయకులను స్మగ్లర్ల బారి నుంచి రక్షించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్న వారిని విచారించేందుకు ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామన్నారు. అలాగే సమాచార సేకరణ, నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ లక్ష్మీనరసింహం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కె వెంకటేశ్వర రావు, ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ ఎస్‌కే సిన్హా, రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న సీఐడీ అదనపు డీజీ అమిత్‌గార్గ్