రాష్ట్రీయం

రెండు రోజుల్లో తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కడప ఉక్కు కోసం నిరాహార దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్ గురువారం సాయంత్రం ఫోన్ చేసి పరామర్శించారు. ఉక్కు పరిశ్రమ ముగిసిన అధ్యాయం కాదని, ముందు దీక్ష విరమించాలని బీరేంద్రసింగ్ కోరారు. దీనికి సీఎం రమేష్ ఉద్వేగంగా స్పందిస్తూ ‘మీరు ఇక్కడికి వచ్చి ఉక్కు పరిశ్రమపై ప్రకటన చేస్తేనే దీక్ష విరమిస్తా’నని సమాధానమిచ్చారు. 2 రోజుల్లో ఉక్కుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే తన శవాన్ని చూడాల్సి వస్తుందని కూడా కేంద్ర మంత్రికి ఆయన స్పష్టం చేశారు. ఈమాట అంటున్నప్పుడు ఉద్వేగానికి లోనైన సీఎం రమేష్ కళ్లలో నీళ్లు తిరిగే సరికి అక్కడున్న తెలుగుదేశం నేతలు కూడా చలించారు. బీరేంద్రసింగ్ నుండి ఫోన్ రాగానే, ఉక్కు పరిశ్రమపై స్వయంగా తనకే హామీ ఇస్తారని ఆశించిన రమేష్, ఆయన నుండి అటువంటి నిర్ణయం ఏదీ లేకపోగా దీక్ష విరమించాలని కోరడంతో నిరాశ చెందారు.
30న చంద్రబాబు ‘ఉక్కు’ ప్రకటన!
* సీఎం రమేష్, బీటెక్ రవి పరామర్శకు కడపకు రాక
ముఖ్యమంత్రి చంద్రబాబు కడప ఉక్కు పరిశ్రమపై ఈనెల 30వ తేదీ ప్రకటన చేయబోతున్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఆంధ్రభూమి ఊహించిందే నిజం కాబోతోంది. ఉక్కు పరిశ్రమ కోసం కడపలో దీక్ష చేస్తున్న సీఎం రమేష్, రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బీటెక్ రవిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 30వ తేదీ కడపకు రానున్నారు. ‘ఉక్కు-మా హక్కు’ అని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీఎం రమేష్ దీక్షకు సంఘీభావం ప్రకటించి దీక్షా శిబిరం నుంచి ప్రసంగించనున్నారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, నారాయణ గురువారం పరోక్షంగా ఈవిషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసిన తర్వాత కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్పష్టమైపోయిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. స్థలం, ఖనిజంపై స్పష్టమైన సమాధానం రాష్ట్రం నుండి రావాల్సివుందని బీరేంద్రసింగ్ చెప్పడం కేవలం కాలయాపనకేనని అర్థమైపోయింది. ఎంపీలు గురువారం ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించగా, ఆయన నిరాకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని నిర్ధారణకు వచ్చిన ముఖ్యమంత్రి, తాను ముందస్తుగానే ఒప్పందం చేసుకున్న ప్రైవేట్ కంపెనీతో జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మెకాన్ సంస్థకు ఇచ్చిన అన్ని సమాచారాలను సదరుప్రైవేట్ కంపెనీకి చూపి, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ సందేహాలను తీర్చి, షరతులను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టు సమాచారం. అయితే ప్రభుత్వరంగ సంస్థ స్థాయిలో 4 ఎంటీపీఏ (సంవత్సరానికి 4 మిలియన్ టన్నుల ఉత్పత్తి) సామర్థ్యంతో ఉక్కు పరిశ్రమను ప్రకటిస్తారా లేక ఏ అర మిలియన్ టన్ను ఉత్పత్తి సామర్థ్యం ఉన్న మధ్యతరహా పరిశ్రమను ప్రకటిస్తారా అన్నది స్పష్టం కావడంలేదు. 2 లేదా 4 ఎంటీపీఏ సామర్థ్యం ఉన్న భారీ పరిశ్రమను ప్రకటిస్తే, తెలుగుదేశంపార్టీకి రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో అనూహ్యంగా ఆదరణ పెరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలాగాక అర మిలియన్ టన్ను సామర్థ్యం ఉన్న పరిశ్రమను ప్రకటిస్తే అది ప్రజల్లో పెదవి విరుపుకే పరిమితవౌతుందని వ్యాఖ్యానిస్తున్నారు. పరిశ్రమ ప్రకటించిన తర్వాత, అనంతపురంలో కియా మోటార్స్ కంపెనీ లాగే అతివేగంగా పనులు ప్రారంభమైతే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం మరింత విశ్వసనీయతను పొందుతుందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.