రాష్ట్రీయం

రైతు బాగే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 28: రైతన్న కలలను సాకారం చేస్తూ వారికి సిరులు కురిపించే ఏరువాకను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారంనాడిక్కడ ప్రారంభించారు. ఎడ్లతో నాగలిపట్టి దుక్కిదున్ని..విత్తనాలు, ఎరువులు వేసి యాంత్రీకరణ విధానంతో నాట్లు వేసి ఏరువాక ఇక్కడ ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. చంద్రన్న రైతు బీమా పథకాన్ని ఈ నెల నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రావికంటిపేటలో ఏరువాకను ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ గ్రీన్‌ఫీల్డ్ క్రీడా ప్రాంగణంలో జరిగిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రైతుకు భరోసా ఇచ్చే చంద్రన్న రైతుబీమా పథకానికి శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టామన్నారు.చంద్రన్న బీమాలో లేనివారికి రైతు బీమాలో అవకాశం ఉంటుందని, ఇది ఈ నెల నుంచే అమల్లోకి వస్తుందని చెప్పారు. 18 నుంచి 70 ఏళ్ల వయసు కలిగిన రైతు చనిపోతే వారికి రూ. ఐదు లక్షలు బీమా ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. పాక్షికంగా అయితే రూ. 2.50 లక్షలు ఇస్తామని, రైతుల పిల్లల చదువుల కోసం ఏటా రూ.1200 స్కాలర్‌షిప్ ఇస్తామని తెలిపారు. రైతుకు అండగా ఉంటానని ఉద్ఘాటించిన చంద్రబాబు తిండిపెట్టే రైతుకు సంఘీభావం తెలియజేసే బాధ్యత అన్నీ
వర్గాలదన్నారు. 2014 ముందు ఎరువులు, యూరియా కొరత తీవ్రంగా ఉండేదని, కరవు వస్తే ఆదుకునేవారే ఉండేవారు కాదన్నారు. ఆదర్శ రైతుల పేరిట అన్నదాతలను అగౌరవం పరిచారని, కరెంటు లేని వ్యవసాయం ఆత్యహత్యలకు దారితీసేదన్నారు. నిరాశ, నిస్పృహలతో రైతులు ఉన్న పరిస్థితుల్లో రూ. 24000 కోట్లు రుణవిముక్తిని చేసామన్నారు. ‘రూ. 16000 కోట్లు లోటుబడ్జెట్, ఖజానాలో డబ్బుల్లేని పరిస్థితి, రాజధాని లేదు, కేంద్ర ప్రభుత్వం సహాయం లేదు, బ్యాంకులు సహకరించలేని పరిస్థితుల్లో ‘1.50 లక్షల మంది రైతులను రుణవిముక్తుల’ను చేశానన్నారు. ఈ ఏడాది రూ. 8200 కోట్లు చెల్లించి రైతులందరినీ రుణ విముక్తుల్ని చేస్తామన్నారు. ఈ ఏడాది రూ. 19,070 కోట్లు వ్యవసాయ బడ్జెట్ రూపొందించామని, గడచిన నాలుగేళ్ళల్లో రూ. 82000 కోట్లు వ్యవసాయ రంగానికి ఖర్చుచేశామన్నారు. మైక్రో న్యూట్రీషియన్స్ ఉచితంగా ఇవ్వడం వల్ల రైతులకు రూ. 375 కోట్లు పొదుపు అయ్యిందన్నారు. రైతు ఆదాయం రెండింతలు చేస్తానన్న ప్రధానమంత్రి కేవలం 2.3 శాతం మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 11 శాతం అభివృద్ధి సాధించి దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచామన్నారు. కర్నూలులో 627 ఎకరాల్లో రూ. 650 కోట్లుతో విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికే సరఫరా చేసే స్థాయికి ఏపీలో వ్యవసాయరంగం ఎదిగిందన్నారు. భూగర్భజలాలు పెంచామని, నదులు అనుసంధానం చేసామని, పోలవరం పూర్తి చేస్తున్నామన్నారు. మరో రెండు నెలల్లో వంశధార రిజర్వాయర్‌లో 8టీఎమ్‌సీల నీటినిల్వలు చేసి, రెండుపంటలకు సాగునీరు అందిస్తామన్నారు. అక్టోబర్‌లో వంశధార, నాగావళి నదులు అనుసంధానం చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి శ్రీకాకుళానికి తీసుకువస్తానంటూ హామీ ఇచ్చారు. పోలవరం ఎడమకాల్వ ద్వారా వంశధారకు అనుసంధానం చేసి రైతుల ఆదాయాన్ని మరింత పెంచేలా సాగునీటిని అందిస్తానన్నారు. రైతుల ఆత్మహత్యలు ఇకపై ఏపీలో ఉండబోవని చెప్పిన సీఎం స్వామినాథ్ కమిటీ నివేదికలు, బీజేపీ హామీలు ఏవీ రైతులను ఆదుకోలేక పోయాయన్నారు. విశాఖపట్నంలో బిల్‌గ్రేట్ ఫౌండేషన్, ఐటీ నిపుణులతో ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రాజెక్టు పెడుతున్నట్టు వెల్లడించారు. ఉత్తరాంధ్రలో జలసిరి ఉందని, అగ్రివాట్స్ ద్వారా ముందస్తు పంటల పరిస్థితి చేప్పే స్థాయికి వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందన్నారు. ఒకరు పాదయాత్రలు చేసి, మరొకరు పోరాట యాత్రలు చేస్తామంటే భయపడిపోయే వ్యక్తిని కాదన్నారు. కేంద్రం సహకరించలేదని, నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. అవినీతితో నిండిపోయిన పనికిరాని పార్టీ రాష్ట్రంలో ఉందని, ఎందుకు ఆ పార్టీ ఉందో ప్రజలే చెప్పాలన్నారు. కడపలో ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ఇవ్వకపోయినా స్పందించలేని పార్టీలు ప్రజల ముందుకు ఏలా రాగలుగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట అన్నారు. అటువంటి కోటలో పాదయాత్రలు, పోరాటయాత్రలు పనిచేయవన్నారు. బీజేపీలో ఉన్నవారంతా గతంలో కాంగ్రెస్‌పార్టీలో ఉన్నవారేనన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీకి అద్దెమైకు..బీజేపీకి సొంత మైకుగా పనిచేస్తున్నారన్నారు. పిరికితనం వదలి కలిసి పోరాటం చేసేందుకు ఆ రెండు పార్టీలు రావాలని పిలుపునిచ్చారు. ఐదుకోట్ల ప్రజలను కేంద్రానికి తాకట్టుపెట్టే పార్టీ టీడీపీకాదని ఉద్ఘాటించారు.

చిత్రాలు....శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం రావికంటిపేటలో గురువారం ఏరువాక ప్రారంభిస్తూ విత్తనాలు చల్లి.. ట్రాక్టర్ నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు